పల్లెలు, పట్టణాల సర్వతోముఖాభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యమని అదనపు కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు.

పల్లెలు, పట్టణాల సర్వతోముఖాభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యమని అదనపు కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు.

శుక్రవారం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా mogudampally మండలం అసద్ గంజ్ గ్రామం లో నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో పలు వార్డుల్లో తిరిగి పల్లె ప్రగతి లో చేయవలసిన పనులను గుర్తించారు. గ్రామాభివృద్ధికి అవసరమైన ఆయా పనులను అందరి భాగస్వామ్యంతో చేయాలన్నారు. గ్రామ పరిశుభ్రత పచ్చదనం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సర్పంచ్, పంచాయతీ సెక్రెటరీ కి, గ్రామ ప్రజలకు సూచించారు.

అనంతరం mogudampally మండలం గొడీగారి పల్లికి చెందిన దళిత బంధు లబ్ధిదారులు జహీరాబాద్ పట్టణంలో పెట్టుకున్న షాపులను సందర్శించి లబ్ధిదారులతో ముచ్చటించారు. వ్యాపారం ఏ విధంగా నడుస్తుంది, ఎంత ఆదాయం వస్తుంది, ఏదైనా సమస్యలు ఉన్నాయా, వ్యాపార నిర్వహణలో మెలుకువలు తెలుసుకుంటున్నారా, తదితర విషయాలను ఆరా తీశారు.

జహీరాబాద్ మండలం రంజోల్, గుల్షన్ నగర్ లలో మన ఊరు మన బడి ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్స్ గా గుర్తించిన పాఠశాలల పనులను పరిశీలించారు. పాఠశాలలు ప్రారంభానికి సమయం తక్కువగా ఉందని, ఆయా పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు ,పంచాయతీరాజ్ డిఇ, ఏ ఈ కి సూచించారు.

జహీరాబాద్ మున్సిపాలిటీ లో నిర్మిస్తున్న తెలంగాణ క్రీడా ప్రాంగణం పనుల పురోగతిని పరిశీలించారు. క్రీడా ప్రాంగణం పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని చెప్పారు.

Share This Post