పల్లెలు పరిశుభ్ర, పచ్చటి పల్లెలు గా మారాలని, అందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు కోరారు.

పల్లెలు పరిశుభ్ర, పచ్చటి పల్లెలు గా మారాలని, అందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు కోరారు.

పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా
సోమవారం కలెక్టర్ సంగారెడ్డి మండలం హనుమాన్ నగర్ గ్రామంలో నర్సరీని, గ్రామీణ క్రీడా మైదానం, తడి, పోడి చెత్త ,ఎరువు తయారీని పరిశీలించారు .

గ్రామంలో నర్సరీ,డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం అన్ని విధాలుగా బాగుందని కితాబునిచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ని అభినందించి శాలువా కప్పి సన్మానించారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. పల్లె ప్రగతి పనులు జోరుగా సాగాలని, అభివృద్ధి దిశగా పల్లెలు పయనించాలన్నారు. పల్లెలు పట్టణాల అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి చేపట్టిందన్నారు. పల్లె ప్రగతి, హరితహారం లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.

గ్రామ స్థాయి నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాల ను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. క్రీడా ప్రాంగణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

కలెక్టర్ వెంట సంగారెడ్డి తహసిల్దార్ స్వామి, గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రెటరీ, తదితరులు ఉన్నారు.

Share This Post