పల్లెలు మెరువాలి ప్రజలు మురువాలి

పల్లెలు మెరువాలి ప్రజలు మురువాలి

పల్లె ,పట్టణ ప్రగతి తో తెలంగాణ లో ఉత్తమ ఫలితాలు

5వ విడత పల్లె ప్రగతి – 4 పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలి

పల్లె -పట్టణ ప్రగతిలో కరెంటు కష్టాలు లేకుండా చూడాలి..

వంగిన ,తుప్పు బట్టిన కరెంటు స్తంభాలు తొలగించాలి..శానిటేషన్ మెరుగు పడాలి

తెలంగాణ గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి

అధికారులు ప్రజలకు జవాబుదారీ తనంగా పని చేయాలి

జూన్ 3 నుండి 18 వరకు పల్లె ప్రగతి

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

000000

     పల్లెలు పట్టణాలుగా మారాలి, పట్టణాలలో ఆధునీకరణ జరగాలి అది చూసి ప్రజలు మురువాలని రాష్ట్ర బీసీ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన ఐదో విడత పల్లె ప్రగతి 4వ విడత పట్టణ ప్రగతి జిల్లాస్థాయి సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జూన్ 3 నుంచి15 రోజులపాటు నిర్వహించే పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం లో ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ కలిసికట్టుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అధికారులు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. ప్రతి ఒక్కరు క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామానికి సందర్శించాలని అవసరమైతే ప్రజాప్రతినిధులు పల్లెనిద్ర చేయాలని,జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధి కి అన్ని విధాలుగా సహకరిస్తున్న సీఎం కేసీఆర్ గారి ఆలోచనలకు అనుగూనంగా అభివృద్ధి చేయాలని,పేరుకుపోయిన సమస్యల పై ఒక ఎజెండా తయారు చేసుకొని ముందుకు సాగాలి అన్నారు. అందరం కలిసి కట్టుగా పల్లె ప్రగతిని విజయవంతం చేద్దామని, పల్లె ప్రగతి ద్వారా దేశంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు.  దేశంలో మన రాష్ట్రాన్ని, మన గ్రామాలను నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దిన ఘనత మన సీఎం కేసీఆర్‌దేనన్నారు. పల్లె ప్రగతి మొదటి రోజు గ్రామాల్లో పాదయాత్రలు, పల్లె ప్రగతి గురించి ప్రజలకు తెలిసేలా ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు.
పంచాయతీలన్నీ పల్లె ప్రగతికి ముందు, పల్లె ప్రగతికి తర్వాత అనేలా తయారయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. నాలుగో విడత పల్లెప్రగతిలో.. ఇప్పటి వరకు నాటిన మొక్కలు బతికేలా, వైకుంఠధామాలను వినియోగించుకొనేలా చూడాలని, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా మన పల్లెల్లో మార్పు వచ్చిందని అన్నారు.
గ్రామాల్లో పది శాతం గ్రీనరీ నిధులతో పెద్దఎత్తున మొక్కలు నాటామని, అవన్నీ ఎండలకు ఎండిపోకుండా నీళ్లు పోసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.285 కోట్లు వెచ్చిస్తుందని తెలిపారు.  రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 3 నుంచి 15 రోజుల పాటు నిర్వహించే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు.గ్రామాల్లో నిర్మించిన వైకుంఠధామాలు కొన్ని వినియోగంలోకి రాలేదని, వాటికి కరెంటు, నీటి వసతి అందించేలా చూసి, వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. దేశంలో సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన లో 20 ఉత్తమ గ్రామాలను కేంద్రం ఎంపిక చేయగా, వాటిలో 19 తెలంగాణవేనని తెలిపారు. హరితహారం, పల్లె ప్రకృతి వనాల వల్ల రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం 7.7 శాతం పెరిగిందని తెలిపారు.  రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాలు, సురక్షిత మంచినీటి సరఫరా, నర్సరీల ఏర్పాటు, వైకుంఠధామాల నిర్మాణంతోపాటు ప్రతి పల్లెలో ఎకరా స్థలంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గ్రామపంచాయతీ ట్రాక్టర్ల ద్వారా ప్రతి గ్రామం ఆదాయం పొందాలని సూచించారు. రాష్ట్రంలోని 12 వేల గ్రామాల్లో 5 వేల పంచాయతీలు ట్రాక్టర్ల ద్వారా ఆదాయం సమకూర్చుకుంటున్నాయని తెలిపారు.
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేలా ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఉత్తమంగా నిర్వహించిన ప్రజాప్రతినిధులకు అవార్డులు అందజేస్తామని ప్రకటించారు.జూన్ 3 నుంచి 18 వరకు 5వ విడత పల్లె ప్రగతి, 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాలు జరుగుతాయని, గతేడాది చేపట్టిన కార్యక్రమాలతోపాటు రానున్న సంవత్సరానికి చేపట్టాల్సిన పనులపై కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల విజయవంతానికి అందరూ కృషి చేయాలని కోరారు. పట్టణ ప్రగతి నిధులతో పట్టణాలు కళకళలాడుతున్నాయని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం తో నేరుగా నిధులు గ్రామాలకు వెళుతుండటంతో గ్రామాలు పరిశుభ్రంగా మారాయని అన్నారు. గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలు, కొత్త సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామన్నారు అన్నారు.

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో దేశంలోనే ముందు వరుసలో తెలంగాణ గ్రామీణ పట్టణ ప్రాంతాలు ఉన్నాయన్నారు. సెల్ ఫోన్ లకు అతుక్కుపోతున్నారు నేటి యువత ను కైరా కారులో మార్చేందుకు, కనుమరుగవుతున్న గ్రామీణ ఆటలకు ప్రాణం పోసేందుకు ప్రతి గ్రామంలో,పట్టణంలో క్రీదా ప్రాంగణాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల పై అధికారులకు పూర్తి అవగాహన స్పష్టత కలిగి ఉండాలనిఅన్నారు. తెలంగాణలో నిధుల కొరత లేదని తెలిపారు. జూన్ 3 నుండి 15 రోజుల పాటు నిర్వహించనున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అధికారులకు విజయవంతం చేయాలని తెలిపారు.

     ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సుడా చైర్మన్ జీవి రామకృష్ణ రావు, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, శాసనసభ్యులు రసమయి బాలకిషన్, సంఖ్య రవిశంకర్, అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, జీవి శ్యాంప్రసాద్ లాల్, జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సేవా ఇస్లావత్, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post