పల్లెల్లో, పట్టణాలలో పచ్చదనం-పారిశుద్ధ్యంతో వెల్లివిరియాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రా రెడ్డి

పల్లెల్లో, పట్టణాలలో పచ్చదనం-పారిశుద్ధ్యంతో వెల్లివిరియాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు.

మంగళవారం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పై వికారాబాద్ డి పి ఆర్ సి భవనం లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో 5వ విడత పల్లె ప్రగతి – పట్టణ ప్రగతిపై జిల్లాస్థాయి సన్నాహక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులను, ప్రజలను భాగస్వాములను చేయాలని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా ముందు ఉండడం ప్రజాప్రతినిధుల అధికారుల సమిష్టి కృషి అని మంత్రి అన్నారు. గ్రామాల్లో సర్పంచులు అభివృద్ధి కార్యక్రమంలో పోటీ పడడం వల్ల గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని ఆమె అన్నారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన సేవలు అందాలని, ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే దిశగా అడుగులు వేయాలని, ప్రజలందరి విస్తృత భాగస్వామ్యంతో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జూన్ 3వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరగనున్న పల్లె ప్రగతి- పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని, సూచించారు. వైకుంఠ దామాలను సత్వరమే పూర్తి చేయాలని ,మిషన్ భగీరథ పథకంలో భాగంగా వైకుంఠ దామాలకు నీటి సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా పెద్ద మొత్తంలో మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం ముందుగానే అభివృద్ధి పనులకు నిధులను కేటాయిస్తూ విధులు నిర్వహించేలా చర్యలు చేపడుతుందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమానికి 10 శాతం గ్రీన్ బడ్జెట్ నుండి ఖర్చు చేసుకునేందుకు అవకాశం కల్పించిందని మంత్రి అన్నారు. మొక్కలు నాటేందుకు చెరువు గట్లను, పాఠశాల ఆవరణలను, క్రీడ ప్రాంగణాల స్థలాలను గుర్తించి పనులు చేపట్టాలన్నారు. అభివృద్ధి పనులు పట్టణాల్లో కంటే గ్రామాల్లో బాగా మార్పు వచ్చిందని, వార్డు కమిటీలు చురుగ్గా పనిచేసేలా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు. కౌన్సిలర్ స్థానాన్ని ఒక యూనిట్ గా చేసుకుని పని చేయాలని తెలిపారు. లక్ష్యాలకు అనుగుణంగా చెట్లను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని తీసుకోవాలని తెలిపారు. వైకుంఠ దామాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి వాటిని బిల్లింగ్ వినియోగించుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రి తెలిపారు. పాఠశాల ప్రారంభోత్సవం లోగా మన ఊరు మనబడి ఎంపిక చేయబడ్డ మండలానికి 2 పాఠశాల చొప్పున సిద్ధంగా ఉంచాలని మంత్రి సూచించారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి లో భాగంగా గ్రామాల్లో పాడుబడ్డ బావుల పూడ్చివేత, మురికి కాలువల శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గతంలో తీసుకోవాల్సిన పనులు ఏవైనా పెండింగ్ లో ఉంటే వాటిని పూర్తి చేయాలని అన్నారు. హరితహారం లో భాగంగా ఖాళీ స్థలం ఎంపిక చేసే పెద్ద మొత్తంలో మొక్కలు నాటే ఎందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించుకున్న ప్పటికీ వాటిని వాడుకలో ఉంచడం లేదని ఇట్టి విషయంలో కఠినంగా వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఏమైనా సూచనలు ఇచ్చినట్లయితే వాటిని పరిగణలోకి తీసుకొని అభివృద్ధి పనులకు జిల్లా పరిషత్ నిధులు ఇవ్వడం జరుగుతుందని ఆమె అన్నారు. వివిధ పనులు చేపట్టే స్థలాల్లో తప్పనిసరిగా బోర్డులు ఏర్పాటు చేయాలని చైర్ పర్సన్ తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ నిఖిల ,ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్ ,కొప్పుల మహేశ్వర్ రెడ్డి ,కాలే యాదయ్య గారు,బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ ,జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ ,గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళి కృష్ణ
,జడ్పీ సిఈఓ జానకి రెడ్డి ,జడ్పీటీసీలు,ఎంపీపీ లు,మునిసిపల్ ఛైర్మన్లు, కమిషనర్లు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి వికారాబాద్ జిల్లా గారిచే జారీ చేయనైనది.

 

Share This Post