పల్లెల అభివృద్ధి తోనే గ్రామ రూపురేఖలు మారతాయి… రాష్ట్ర పంచాయతీ రాజ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా

ప్రచురణార్థం

పల్లెల అభివృద్ధి తోనే గ్రామ రూపురేఖలు మారతాయి…

మహబూబాబాద్ మండలం
మహబూబాబాద్ జూలై 6.

పల్లెల అభివృద్ధి తోనే గ్రామ రూపురేఖలు మారుతాయని రాష్ట్ర పంచాయతీ రాజ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. మంగళవారం మహబూబాబాద్ మండలంలోని జంగిల్ గొండ గ్రామంలో ఏర్పాటుచేసిన నాలుగవ పల్లె ప్రగతి కార్యక్రమంలో పంచాయతీరాజ్ సెక్రెటరీ పాల్గొని మాట్లాడారు.

గతంలో నిధులు లేక గ్రామ పంచాయతీలు అభివృద్ధికి నిరోధకంగా మారాయని రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామాల అభివృద్ధి పైనే ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు కేటాయించి పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేశారన్నారు. 12వేల గ్రామపంచాయతీలకు కేవలం మూడు వేల మంది పంచాయతీ సెక్రటరీలు ఉండేవారని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క 12 వేల గ్రామపంచాయతీలకు 12 వేల మంది పంచాయతీ సెక్రటరీలు ఉండాల్సిందేనని మరో 9 వేల పంచాయతీ సెక్రటరీ లను నియమించడం జరిగిందన్నారు.

కరోనా తో ప్రభుత్వ ఆదాయం తగ్గిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉందన్నారు. రెండు నెలలకోసారి తప్పనిసరిగా గ్రామ సభ ఏర్పాటు చేయాలని సర్పంచులు సెక్రటరీలు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే విధుల నుండి తొలగిస్తామన్నారు. పల్లెల అభివృద్ధి చెందేందుకు ప్రజలలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందిస్తాయని సర్వాధికారాలు ప్రజలకే ఉంటాయన్నారు ప్రజలు తమ సమస్యలను విన్న విన్చేందుకు కలెక్టర్ కార్యాలయాలకు వచ్చి గ్రీవెన్స్ ద్వారా తమ సమస్యలు తెలియజేసుకునే వారని, వాట్సాప్ తో నేరుగా తమ సమస్యలను కలెక్టర్ కు విన్నవించుకునే అవకాశం ఉందన్నారు. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో వాతావరణం అనుకూలంగా ఉండటం లేదని గ్రామాలలో పచ్చదనం విరివిగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు గత ఐదు సంవత్సరాలుగా ఆరు విడ తలలో 230 కోట్ల చెట్లు నాటడం జరిగిందన్నారు. ప్రస్తుత సంవత్సరము లో మొక్కల మధ్య గ్యాప్స్ ఉండరాదు అన్నారు. సిసి రోడ్లు రోడ్లు భవనాల శాఖ రహదారులు గిరిజన ప్రాంతాలలోని రహదారులలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు తప్పనిసరిగా నాటాలి అన్నారు కేంద్ర ప్రభుత్వం దోమల నివారణ తో 90% వ్యాధులు తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న దన్నారు నిరంతర కృషి వల్లనే దోమల నివారణ సాధ్యపడిందన్నారు ఇంటింటికి సేకరిస్తున్న తడి చెత్త పొడి చెత్త ఇంటిలోనే వేరు చేయించాలని తడి చెత్తను ఎరువుగా, పొడి చెత్తను ఆదాయవనరుగా మార్చుకోవాలన్నారు. గ్రామాలలో ఇంటింటికి సోక్ ఫిట్ నిర్మాణాలను మరుగుదొడ్ల ను తప్పనిసరిగా చేపట్టాలన్నారు. పంచాయతీలలో పెండింగ్ ఉన్న 750 కోట్ల బిల్ల్స్ ను మంజూరు చేసినట్లు తెలియజేశారు ఇంటింటికి ఆరు మొక్కలు అందించడమే కాకుండా నాటీంప పనిచేయాలన్నారు. పంచాయతీ లో 4 కమిటీలు ఉన్నట్లు తెలియజేస్తూ శానిటేషన్ కమిటీలో 50 శాతం మహిళలు ఉండాలన్నారు హరితహారం కమిటీ పనుల కమిటీ స్ట్రీట్ లైట్స్ కమిటీ వంటివి ఉన్నట్లు తెలియజేశారు పల్లె ప్రగతి లో అవసరమైన చోట పోల్స్ వేయాలని లూజు వైర్స్ సరిచేయాలన్నారు. మండలంలోని 41 గ్రామ పంచాయతీల పై పర్యవేక్షణ ఎం పీ ఓ లకే ఉందని ప్రతిరోజు మూడు పంచాయతీలను సందర్శించి పనులను పర్యవేక్షించాలని అన్నారు. 10 ఎకరాల్లో చేపట్టే మెగా హరితహారాన్ని విజయవంతంగా పూర్తి చేయాలన్నారు.

అనంతరం అదే గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ తో కలిసి మొక్కలు నాటారు. వైకుంఠధామం సెగ్రిగేషన్ షెడ్ లను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ ట్రైనీ కలెక్టర్ అభిషేక్ అగస్త్య జడ్పీ సీఈఓ అప్పారావు డి ఆర్ డి ఏ పి డి సన్యాసయ్య,
జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్ విద్యుత్ శాఖ ఎస్ ఈ నరేష్ మిషన్ భగీరథ అధికారులు కృష్ణారెడ్డి సురేందర్ ఎంపీడీవో రవీందర్ తాసిల్దార్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు
——————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post