*పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలు దేశానికి రోల్ మోడల్* *5వ విడత పల్లె ప్రగతి, 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమం సమర్థవంతం గా అమలు చేయాలి:రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగ దీశ్ రెడ్డి* # నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో సూర్యాపేట, యాదాద్రి భువన గిరి జిల్లాల ప్రజా ప్రతినిధులు,జిల్లా కలెక్టర్ లు, అధికారులతో పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి సన్నాహక సమావేశం # పారిశుధ్యం, పరిశుభ్రత తో పాటు హరిత హారం పై ప్రత్యేక దృష్టి జూన్ 3 నుంచి 15 రోజుల పాటు నిర్వహించనున్న 5 వ విడత పల్లె ప్రగతి,4 వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని శాసనసభ్యులు,ప్రజా ప్రతినిధులు,ప్రజలు భాగస్వామ్యంతో సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు

గురువారం నల్గొండ కలెక్టరేట్ లోని ఉదయాదిత్య భవన్ లో పల్లె ప్రగతి – పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణపై నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల ఎమ్మేల్యేలు, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు, ఎం.పి.డి.ఓ.లు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కమీషనర్లతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగ దీశ్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ పంచాయితీలలో పల్లె ప్రగతి,పట్టణంలలో పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నందున అధికారులు ప్రజాప్రతినిధులకు తగు సమాచారం అందజేసి రోజు వారీ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు. పల్లెలలో పెంట చెత్త దిబ్బలు, మురికి కాలువల ఉన్న గ్రామాలు రూపు మార్చుకుని అందంగా ముస్తాబు అవుతున్నాయని ఆయన అన్నారు. పల్లె ప్రగతి – పట్టణ ప్రగతి దేశంలోనే ఒక రోల్ మోడల్ అని ఆయన అన్నారు. భారత దేశంలో ఎక్కడా లేని విధంగా పల్లె ప్రగతి – పట్టణ ప్రగతిలో పౌరులకు సేవలు,వసతులు కల్పన చేయడం లో మనకు మనమే పోటీ అని,రాష్ట్రం పడే పరిస్థితి లేదని  ఆయన అన్నారు. మనతో పోటీ పడడానికి దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పథకాలు లేవని ఆయన తెలిపారు. ఇటీవల కేంద్రం స్వచ్చ గ్రామలుగా 10 గ్రామాలకు 10 గ్రామాలు,20 కి 19 గ్రామాలు  ఉత్తమ గ్రామాలుగా మన తెలంగాణ రాష్ట్రానివే ఎంపిక అయినట్లు  ఆయన తెలిపారు.  ఇవన్నీ మన పల్లె ప్రగతి కార్యక్రమాలలో మనం చేసిన పనులే ఆ గుర్తింపును తీసుకువచ్చాయని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వస్తే ఏ హమీలు అయితే ఇచ్చారో . .  ఏ కలలు కన్నారో . .  అంతకు మించిన అద్భుత ప్రగతి కేసీఆర్ నాయకత్వంలో మనం సాధిస్తున్నామని ఆయన తెలిపారు. ఒక కుటుంబంలో పెద్ద ఎలా ఆ కుటుంబ అవసరాలను గుర్తించి జీవనం కొనసాగిస్తారో . . అదే విధంగా మన తెలంగాణ రాష్ట్రానికి పెద్దగా ఉండి  కేవలం 8 సంవత్సరాలలోనే మానవీయ కోణం లో ఎన్నో పథకాలు అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్దిలో పరుగులు పెట్టిస్తున్నారని ఆయన తెలిపారు. అధికారులు రాత్రి పగలు తేడా లేకుండా పని చేస్తేనే అనుకున్న ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు.  ప్రభుత్వ పథకాల అమలులో జిల్లా కలెక్టర్ నుండి గ్రామస్థాయి అధికారుల పాత్ర అభినందనీయమని వారి సేవలను గుర్తు చేశారు.  స్థానిక ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చడానికి వారు పడుతున్న తపన, పనులు జరగాలనే వారి తాపత్రాయం చెప్పలేనిదన్నారు. అదే విధంగా ప్రజల సమస్యలు తీర్చేటప్పుడు ఎక్కడా రాగద్వేషాలకు, భేదాభిప్రాయాలకు తావు లేకుండా చిత్త శుద్దితో పని చేస్తున్నారని ప్రజా ప్రతినిధులను అభినందించారు. ఇవ్వాల మన నల్లగొండ ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామాలలో అద్బుతమైన ప్రగతి కనిపిస్తుందని మంత్రి తెలిపారు. గ్రామాలలో పల్లె ప్రగతి కార్యక్రమాలకు వెల్లి నప్పుడే హరిత హరం మొక్కలు నాటడానికి అవసరమైన అన్నీ రకాల ప్రణాళికలు రూపొందించుకుని  వర్షాలు పడగానే మొక్కలు నాటే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన అధికారులను కోరారు. ఈ సారి హరిత హారంలో ముఖ్యంగా ఆర్ అండ్ బి,  నేషనల్ హైవేరోడ్లతోపాటు చెరువు గట్లు, శిఖం భూములు, వాగులు వంకలు, నదీ ప్రాంతాలలో మొక్కలు నాటడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా నాగార్జునసాగర్ ప్రాంతం, సాగర్ కెనాల్స్, దేవరకొండ, మునుగోడు, నల్లగొండ, నకిరేకల్ వాగుల ఘట్ల వెంట మొక్కలు నాటాలని ఆయన సూచించారు. మూసీకి సంబంధించిన కాల్వలను కూడా గుర్తించి మొక్కలు నాటడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఆ విధంగా మొక్కలు నాటడం వలన ప్రభుత్వ భూములలో చెట్లు పెరుగుతాయి, ఆ భూములు అన్యా క్రాంతం కాకుండా నివారించవచ్చని మంత్రి తెలిపారు.  పల్లె ప్రగతి కార్యక్రమాల కోసం గ్రామాలకు వెళ్లినప్పుడే పాఠశాలలను కూడా విధిగా సందర్శించాలని ఎమ్మేల్యేలను, అధికారులను ఆదేశించారు.  పాఠశాలలలో చెత్తా చేదారం లేకుండా శుభ్రపర్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎంపికైన పాఠశాలల పనులు ప్రారంభించుకోవాలని ఎమ్మేల్యలను కోరారు. గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాట్ల విషయంలో మాత్రం స్థానిక ఎమ్మేల్యే,  గ్రామానికి సంబంధించిన యూత్ ను భాగస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు. క్రీడా ప్రాంగణాలు గ్రామస్తులు ఉపయోగించుకోవడానికి అనువైన స్థలాలలోనే ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అదే విధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పూర్తి చేసిన వైకుంఠ దామాలకు బోర్లు వేసి నీటి సదుపాయం, విద్యుత్ సౌకర్యం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గ్రీన్ కవర్ తక్కువగా ఉందన్నారు. నల్లగొండలో 9 శాతం, సూర్యాపేటలో 3.5 శాతం, భువనగిరిలో 3.5 శాతం మాత్రమే ఉందన్నారు. వాస్తవానికి 33 శాతం గ్రీన్ కవర్ ఉండాలని కేవలం 3 శాతం మాత్రమే ఉందని ఆయన తెలిపారు. గ్రీన్ కవర్ పెరగడానికి హరిత హారం కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు, పోలీస్ శాఖతో సహా ప్రజలు, విద్యార్థిని విద్యార్థులను భాగస్వామ్యం చేసి ఉద్యమం రూపంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆయన అధికారులకు సూచించారు.  మున్సిపాలిటీ ప్రాంతాలలో ఖాళీ స్థలాలలో మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్లను ఆదేశించారు.
పల్లె ప్రగతి – పట్టణ ప్రగతి కార్యక్రమంలో రోజు వారీ ప్రణాళిక గురించి కలెక్టర్లు సమావేశంలో వివరించారు. జూన్ 3వ తేదీ నుండి  జూన్ 18వ తేదీ వరకు మొత్తం 15 రోజులపాటు పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మొదటి రోజు పాదయాత్ర చేసిన అనంతరం గ్రామ సభ ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి సందేశం చదివి వినిపించడం, అదే రోజు గ్రామానికి అవసరమైన మౌళిక సదుపాయాల కోసం బడ్జెట్ అంచనాలు రూపొందించడం, ఒక రోజు ప్రభుత్వ పాఠశాలలు, పి.హెచ్.సి. సెంటర్లు, ఇతర ప్రభుత్వ సంస్థలను సందర్శించి శుభ్రపర్చడం, ఒక రోజు  గ్రామంలోని రోడ్లను పరిశీలించడం, ఒక రోజు పవర్ డే పాటించి గ్రామంలోని విద్యుత్ స్తంభాలను పరిశీలించి చెడిపోయిన లేదా విరిగిపోయిన వాటిని గుర్తించి మార్పించడానికి చర్యలు తీసుకుంటాం, ఒక రోజు మురుగు కాలువలను పరిశీలించి ప్రజలకు అవగాహన,  ఆ విధంగా ప్రతి రోజు ఒక కార్యక్రమం చొప్పున 15 రోజులు కార్యకమాలు ఉంటాయని కలెక్టర్లు వివరించారు. ప్రతి గ్రామ పంచాయితీలో పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపు, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. పైన తెలియజేసిన కార్యక్రమాలపై అధికారులకు, ప్రజా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ప్రణాళికలు సిద్దం చేసినట్లు మంత్రికి వివరించారు.
ఈ సమావేశంలో శాసనసభ్యులు జిల్లా కలెక్టర్లు ప్రశాంత్ జీవన్ పాటిల్, పమేలా సత్పతి, వినయ్ కృష్ణా రెడ్డి, శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, భాస్కర్ రావు, చిరుమర్తి  లింగయ్య, నోముల భగత్, రవీంద్రనాయక్, పైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిశోర్, సైదిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్లు బండ నరేందర్ రెడ్డి, దీపికా యుగంధర్, సందీప్ రెడ్డి,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
*పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలు దేశానికి రోల్ మోడల్*
*5వ విడత పల్లె ప్రగతి, 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమం సమర్థవంతం గా అమలు చేయాలి:రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగ దీశ్ రెడ్డి*
# నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో సూర్యాపేట, యాదాద్రి భువన గిరి జిల్లాల ప్రజా ప్రతినిధులు,జిల్లా కలెక్టర్ లు, అధికారులతో పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి సన్నాహక సమావేశం
# పారిశుధ్యం, పరిశుభ్రత తో పాటు హరిత హారం పై ప్రత్యేక దృష్టి
జూన్ 3 నుంచి 15 రోజుల పాటు నిర్వహించనున్న
5 వ విడత పల్లె ప్రగతి,4 వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని శాసనసభ్యులు,ప్రజా ప్రతినిధులు,ప్రజలు భాగస్వామ్యంతో సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు

Share This Post