పల్లె, పట్టణ ప్రగతి పనులను ప్రణాళికాబద్ధంగా చేయాలి….. జిల్లా.కలెక్టర్ కె. శశాంక.

పల్లె, పట్టణ ప్రగతి పనులను ప్రణాళికాబద్ధంగా చేయాలి….. జిల్లా.కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్ధo

పల్లె, పట్టణ ప్రగతి పనులను ప్రణాళికాబద్ధంగా చేయాలి….. జిల్లా.కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్, జూన్ -01:

పల్లె, పట్టణ ప్రగతి పనులను ప్రణాళికబద్దంగా చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ ప్రగతి సమావేశ మందిరంలో 5వ విడత పల్లె ప్రగతి , 4వ విడత పట్టణ ప్రగతి జూన్ 3 నుండి మొదలు అవుతున్నందున చేయవలసిన పనులపై జిల్లాలోని ఎంపీడీవో, ఎంపిఓ లతో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో పల్లెప్రకృతి వనాలలో, సెగ్రిగేషన్ షెడ్ల లో జరుగుతున్న పనులపై, ఉన్న సమస్యలను మండలాల వారిగా ఎంపిడిఓ, ఎంపిఓ లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భoగా సమస్యల పరిష్కారానికి పలు సూచనలు చేశారు. గ్రామ పంచాయతీ లలో ఊరికి దూరంగా ఉన్న కొన్ని గ్రామ పంచాయితీ లలో వైకుంఠ దామాలలో, మిషన్ భగీరథ నీరు సరఫరా లేకుంటే నీటి వసతిని గ్రామ పంచాయతీ నిధుల నుండి బోర్ వెల్ వేసుకొని సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా సెగ్రిగేషన్ షెడ్ లలో గ్రేడింగ్ కు ప్లాన్ చేయాలని, ఎన్ని కిలోల ఎరువును ఉత్పత్తి చేస్తున్నామో, వాటికి ఎంత విలువ వస్తుందనేది తెలుసుకోవాలని దాని ద్వారా గ్రామ పంచాయతీ నిదులను సమకూర్చుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ పంచాయితీలలో పారిశుద్ధ్యం ప్రతి రోజు జరగాలని, రోజు వారీ చెత్త సేకరణ రెండు పర్యాయాలు సేకరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లపై కూరగాయలు అమ్మకుండా మండలానికి ఒక సంత ను నెలకొల్పే విధంగా స్థలాన్ని పరిశీలించాలన్నారు.

శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లను ఇళ్ల యజమానుల అనుమతి తీసుకొని కూల్చివేసేవిధంగా చర్యలు చేపట్టాలని, గ్రామ పంచాయతీ వాటర్ ట్యాoకులను ప్రతినెల శుభ్ర పరిచాలని, జిల్లాలోని ప్రతి గ్రామంలోని పాఠశాలలు శుభ్రంగా ఉండేందుకు గ్రామపంచాయతీలు చర్యలు చేసుకోవాలని అన్నారు.

గ్రీన్ యాక్షన్ ప్లాన్ లో మొక్కలకు అనువైన స్థలాలను గుర్తించి, మొక్కలకు సపోర్టుగా పెట్టేందుకు ట్రీగార్డ్స్,వెదురు కర్రలను టెండర్ల ను పిలిచి వాటి ధరలను ఫైనల్ చేయాలన్నారు.

అదేవిధంగా ఎంపీపీ, ఎంపీటీసీ ప్రతి గ్రామ పంచాయతీ లోని , సర్పంచులను, వార్డు మెంబర్లను కలుపుకొని పల్లె, పట్టణ వార్డులు పరిశుభ్రంగా ఉండి రాష్ట్రంలో మహాబూబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలిచేవిధంగా కృషి చేయాలన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జెడ్పి సీఈఓ రమాదేవి, డిఆర్డీఓ సన్యాసయ్య, ఎంపిడిఓ లు, ఎం.పి.ఓలు,
అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post