పల్లె ప్రకృతి వనం, వైకుంఠ దామాలను గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్ రావు అన్నారు.

పత్రికా ప్రకటన                                      మహబూబ్ నగర్
6 .7. 2021
___________
పల్లె ప్రకృతి వనం, వైకుంఠ దామాలను గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్ రావు అన్నారు.
మంగళవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా, నవాబ్ పేట మండలం, తీగలపల్లి, కాకర్ల పాడు గ్రామాలలో పల్లె ప్రగతి కింద చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను తనిఖీ చేశారు . అంతేకాక హరితహారం కింద ప్రజలకు 6 మొక్కలను పంపిణీ చేశారు.
ముందుగా తీగలపల్లి పల్లె ప్రకృతి వనం తనిఖీకి వచ్చిన రఘునందన్ రావుకు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్వాగతం పలికారు .
పల్లె ప్రకృతి వనం పచ్చని చెట్లతో, నర్సరీని, చెత్తను వేరు చేసే షెడ్డును కూడా అక్కడే నిర్వహించడం,పల్లె ప్రకృతి వనం అహల్లదకరంగా తీర్చి దిద్దడం పట్ల కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
పల్లె ప్రకృతి వనం లో నాటిన మొక్కలు, పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన ఆట పరికరాలు,ఊయలలు, తదితరాలను తనిఖీ చేశారు.
చెత్తను వేరు చేసే షెడ్డు ను తనిఖీ చేస్తూ ఎప్పటినుండి వర్మి కంపోస్టు తయారు చేస్తున్నారని? ఎంత సమయం పడుతున్నదని ప్రశ్నించారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి తో రోజుకు ఎంత చెత్త సేకరిస్తున్నారని అడిగారు. పల్లె ప్రకృతి వనం వద్ద కమిషనర్ మొక్కలు నాటారు.
అనంతరం గ్రామంలోకి వస్తుండగా పొలంలో విత్తనాలు వేస్తున్న రైతులతో కమిషనర్ మాట్లాడారు.
గత సంవత్సరం ఏ పంట వేశారని,ఇప్పుడు ఏ పంటలు వేస్తున్నారని, కౌలు రైతు ఆంజనేయులు,రైతు భాస్కర్ లను కమిషనర్ అడిగారు.
5 ఎకరాలు కౌలుకు తీసుకున్నానని,మొక్కజొన్న వేస్తున్నని కౌలు రైతు ఆంజనేయులు తెలుపగా , మొక్క జొన్న విత్తనాలు ఎక్కడ కోన్నారని? అని కమిషనర్ ప్రశ్నించారు.
తన 4 ఎకరాలలో గత సంవత్సరం పత్తి వేశానని, అయితే వర్షం ఎక్కువగా కురియడం వల్ల దిగుబడి రాలేదని ,ఈ సంవత్సరం మొక్కజొన్న వేస్తున్నామని మరో రైతు భాస్కర్ తెలిపారు.
ఈ సంవత్సరం కూడా 4 ఎకరాల్లో పత్తి వేశానని ,తనకు రైతుబంధు వచ్చిందని ,ఆ మొత్తం తో విత్తనాలు కొనుగోలు చేశానని, భూమి చదును చేయించాను అని భాస్కర్ వివరించారు.
ఎరువులు,విత్తనాల కొనుగోలు సమయం లో తంబు తీసుకున్నారా అని కమిషనర్ ప్రశ్నించగా ? ఎరువుల కొనుగోలు వద్ద థంబ్ ఇచ్చానని భాస్కర్ వివరించారు.
అనంతరం గ్రామం లో గృహ యజమానులకు కమిషన్ హరితహారం కింద ఇంటింటికి 6 మొక్కలను పంపిణీ చేశారు.
ఆ తర్వాత ఇదే మండలం కాకర్ల పాడు గ్రామంలో వైకుంఠధామం చెత్త వేరు చేసే షెద్దులను కమిషనర్ తనికి చేశారు.
జిల్లాలో గ్రామ కంఠం సమగ్ర అభివృద్ధి కోసం అన్ని గ్రామ పంచాయతీల కు రూపొందించడం జరిగిందని, ఇప్పటివరకు 279 గ్రామ పంచాయతిలలో గ్రామా ఖంటం సమగ్ర అభివృద్ధి పనులు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు వివరించారు. గ్రామంలో పల్లె ప్రగతి , పారిశుద్ధ్య కార్యక్రమం సర్వే సందర్భంగా గిర్థించిన పనుల వివరాలను పంచాయతీ కార్యదర్శి ద్వారా అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన రైతు వేదిక ను సందర్శించారు .
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, డి ఆర్ డి ఓ యాదయ్య,జెడ్ పి సి ఈ ఓ జ్యోతి ,డి పి ఓ వెంకటేశ్వర్లు, ప్రత్యేక అధికారి ,డీసీవో సుధాకర్ ,జిల్లా వ్యవసాయ అధికారి సుచరిత,ఆత్మ పిడి హుఖ్య నాయక్, తాహసిల్దార్ రాఘవేందర్ రెడ్డి ,ఎం పి డి ఓ శ్రీ లక్ష్మీ,తీగలపల్లి ,కాకర్ల పహాడ్ గ్రామ సర్పంచ్ లు జంగయ్య,జంగమ్మ, గ్రామ పంచాయతీల కార్యదర్శులు తదితరులు ఉన్నారు.
____________

జారి చేసినవారు సహాయ సంవహాలకులు, సమాచార శాఖ, మహబూబ్ నగర్

Share This Post