పల్లె ప్రకృతి వనాలను ప్రజలు ఉపయోగించుకోవాలి….. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

పల్లె ప్రకృతి వనాలను ప్రజలు ఉపయోగించుకోవాలి….. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

పల్లె ప్రకృతి వనాలను ప్రజలు ఉపయోగించుకోవాలి….. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ముడుపుగల్
మహబూబాబాద్, జూన్ -04:

గ్రామంలోనీ పల్లె ప్రకృతి వనం ను ప్రజలు ఉపయోగించుకునే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు.

పల్లె ప్రగతి కార్యక్రమం సందర్భంగా శనివారం మహబూబాబాద్ మండలం ముడుపుగల్ గ్రామంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి వైకుంఠ ధామం, పల్లె ప్రకృతి వనం, నర్సరీ ని పరిశీలించారు.

జిల్లా కలెక్టర్ వైకుంఠ ధామం పరిశీలిస్తూ, అంచనా విలువ 12-60 లక్షలతో నిర్మించిన వైకుంఠ ధామం లో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా అన్ని వసతులు కల్పించాలని, అధికారులు పర్యవేక్షణ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు, నీటి సరఫరా తీరును, దహనకాండ, స్నానాల గదులను పరిశీలించారు. కట్టెలు ఉంచుటకు స్టోర్ ఏర్పాటు చేయాలని సూచించారు.

నర్సరీని పరిశీలిస్తూ నర్సరీ లోని మొక్కలు గ్రోత్ లేదని, చిన్నచిన్న గ్రామాల్లో బ్రహ్మాండంగా నర్సరీలు ఉన్నాయని, ఇక్కడ పెంచుతున్న వాటిలో మాత్రం ఎదుగుదల కనబడుట లేదని, పర్యవేక్షణ కొరవడిందని, ఫీట్ నుండి ఫీటున్నర సైజ్ మొక్కలను ఇళ్లకు అందించాలని, మీటర్, మీటరన్నర సైజ్ మొక్కలను బ్లాక్, అవెన్యూ ప్లాంటేషన్ కు ఉపయోగించాలని తెలిపారు. మొక్కలకు వాడుతుతున్న మట్టి నాణ్యత సరిగా చూసుకోవాలని, పెరుగుదలకు అనువైన మట్టిని తెప్పించుకోవాలని, జీవామృతం వాడాలని తెలిపారు. నర్సరీ లో పెంచుతున్న మొక్కల పెరుగుదల సరిగా లేనందున హరిత హారం క్రింద మండలానికి లక్ష్యం మేరకు అవసరమైన మొక్కలు నర్సరీ నుండి సరిపోని పక్షంలో తెప్పించుకోవాలని, మొక్కల పెంపకంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

నర్సరీ లో పెంచుతున్న మొక్కల వివరాలను జిల్లా కలెక్టర్ అడగగా, నర్సరీ లో మొత్తం 18 వేల మొక్కలకు గాను 11 వేల మొక్కలు ఫ్రెష్, 4 వేల మొక్కలు కన్వర్షన్ కొరకు, 3 వేల మొక్కలు మైంటేనన్స్ కొరకు పెంచుతున్నట్లు పంచాయతీ సెక్రటరీ, టెక్నికల్ అసిస్టెంట్ లు కలెక్టర్ కు వివరించారు.

పల్లె ప్రకృతి వనం ను పరిశీలిస్తూ, గ్రామస్తులు ప్రకృతి వనాలను ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే సమావేశాలు, చిన్న చిన్న ఫంక్షన్ లను ఇక్కడే చేసుకునే విధంగా ప్రజలకు తెలపాలని, కూర్చోవడానికి అనువుగా సిమెంట్ బెంచ్ లు ఏర్పాటు చేయాలని, పల్లె ప్రకృతి వనం లోకి వైకుంఠధామం గేటు నుండి కాకుండా మరోవైపు గల గేటు నుండి వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని తెలిపారు.

కలెక్టర్ సెగ్రీగేషన్ షెడ్ ను పరిశీలిస్తూ, వాడుతున్నట్లు, గ్రామం నుండి చెత్త సేకరిస్తున్నట్లు కనబడుట లేదని, తడి, పొడి చెత్తను సేకరించి కంపోస్ట్ ద్వారా, పొడి చెత్త అమ్మకం ద్వారా ఆదాయం పెంచుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమ, పంచాయతీ సెక్రటరీ స్పందన, జెడ్పీటీసీ ప్రియాంక, ఎంపిడిఓ వెంకట్ రెడ్డి, ఎం.పి. ఓ. హరిప్రసాద్, ఏ.పి.ఓ. ప్రదీప్, డి.ఆర్.డి. ఓ. సన్యాసయ్య, డి.పి. ఓ సాయి బాబా, టెక్నికల్ అసిస్టెంట్ స్వప్న, తదితరులు పాల్గొన్నారు.

Share This Post