పల్లె ప్రకృతి వనాలు ప్రజలకు ఉపయోగపడాలి – జిల్లా కలెక్టర్ శశాంక

ప్రచురణార్థం

మహబూబాబాద్ సెప్టెంబర్ 24.

పల్లె ప్రకృతి వనాలు ప్రజలకు ఉపయోగపడాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

శుక్రవారం అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి మరిపెడ మండలం పురుషోత్తమాయ గూడెం బురహాన్ పురం గ్రామాలలో సందర్శించి నర్సరీ, స్మశాన వాటిక, సెగ్రిగేషన్ షెడ్, పల్లె ప్రకృతి వనం సందర్శించి పరిశీలించారు.

నర్సరీ నిర్వహణ పై సంతృప్తి వెలిబుచ్చుతూ, వేతనాలను కూడా సకాలంలో అందజేయాలన్నారు. నర్సరీ ముందు భాగాన్ని అందంగా తీర్చిదిద్దాలని బోర్డు కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.

స్మశాన వాటికను సందర్శిస్తూ బాత్ రూమ్ లను పరిశీలిస్తూ శుభ్రం చేయించాలన్నారు. ఆవరణ లో క్రమ పద్ధతిలో చెట్లు నాటాలని అధికారులకు సూచించారు ఆవరణను చదును చేయించి శుభ్ర పరచాలన్నారు.

అనంతరం రోడ్డు పక్కనే ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి కలెక్టర్ ప్రజా ప్రతినిధులు, అదికారులతో కలిసి పరిశీలించారు. పల్లె ప్రకృతి వనం అందంగా ఉన్నదని, ఆహ్లాదకరంగా కూడా ఉన్నదని ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది అన్నారు పల్లె ప్రకృతి తక్షణం ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు బెంచీలు, పిల్లలు ఆడుకునే వస్తువులను ఏర్పాటు చేయగలిగితే ప్రజలు తమ కుటుంబాలతో వినియోగించుకుంటారని తెలియజేశారు.

తదనంతరం సూర్యాపేట రోడ్డులో ఉన్న బురహాన్ పురం వద్ద రోడ్డు పక్కనే ఎనిమిది ఎకరాలలో ఏర్పాటుచేసిన బృహత్ పట్టణ ప్రకృతి వనాన్ని సందర్శించి మొక్కలను, వాకింగ్ ట్రాక్ ను పరిశీలించారు. అధికారులతో మాట్లాడారు. మ్యాప్ను పరిశీలిస్తూ స్థల వివరాలు తెలుసుకుంటూ వెంటనే స్ట్రేంచ్ కొట్టించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ వెంట ఎంపీపీ గుగులోత్ అరుణ రాంబాబు, ఉద్యాన అధికారి సూర్యనారాయణ, ఎంపీడీవో కుమార్, తాసిల్దార్ రమేష్ బాబు, సి డి పి ఓ శిరీష, ఎ పి ఓ మంగమ్మ, పంచాయతీ సెక్రటరీ శ్రీలత , నరేష్ తదితరులు పాల్గొన్నారు.
—————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది.

Share This Post