పల్లె ప్రగతికి ముందు, తర్వాత జరిగిన మార్పులు ప్రజలకు కనబడేలా చేయాలి : జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి

 

పల్లె ప్రగతి కి ముందు, తర్వాత జరిగిన మార్పులు ప్రజలకు కనబడేలా చేయాలి

జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి*

——————————
——–
జిల్లా వ్యాప్తంగా 5వ విడత పల్లెప్రగతిని విజయవంతం చేయాలని జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి అన్నారు. పల్లె ప్రగతి కి ముందు, తర్వాత జరిగిన మార్పులు ప్రజలకు కనబడేలా చేయాలనీ స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు.

జూన్ 3వ తేదీ నుండి జూన్18వ తేదీ వరకు నిర్వహించనున్న ఐదో విడత పల్లెప్రగతి నిర్వహణపై సన్నాహక సమీక్షా సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళ వారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గారితో కలిసి జెడ్పీటీసీ లు, ఎంపీపీలు, ఎంపీడీఓలు, ఎంపిఓలు, అధికారులకు నిర్వహించారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇతర సిబ్బంది పల్లెల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలన్నారు.
పల్లెప్రగతి ప్రారంభం రోజున గ్రామాల్లో పాదయాత్రలు, గ్రామసభలు నిర్వహించి సీఎం సందేశాన్ని చదివి వినిపించాలన్నారు. పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలని, ఒకరోజు పవర్‌డే పాటించి పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలన్నారు. తాగునీటి వనరులను గుర్తించి శుభ్రం చేయాలని, డంపింగ్‌యార్డు, వైకుంఠధామాలను సందర్శించాలన్నారు. గ్రామస్థుల సహకారంతో శ్రమదానం చేసి పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. పాడుబడిన, నిరుపయోగంగా ఉన్న బావులను పూడ్చివేయాలని, ఇళ్ల శిథిలాలను తొలగించాలన్నారు.
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇందులో ప్రధాన భూమిక పోషించాలని ఆమె సూచించారు. సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో తెలంగాణలో ఈ ఏడాది వరకు 7.5 శాతం పచ్చదనం పెరిగిందన్నారు. దేశంలో ఎక్కడా గ్రీనరీ ఇంతలా పెరగలేదన్నారు.
దేశంలో అటవీ విస్తీర్ణం పెంచడం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. కేవలం తెలంగాణలోనే రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం పెంపు పై దృష్టి సారించిందన్నారు.
ప్రతి ఒక్కరు మొక్కలు నాటి,సంరక్షించే ప్రోత్సాహించాలన్నారు. గ్రామాల్లో క్రీడ ప్రాంగణాలు అందుబాటులోకి తీసుకు రావాలని అన్నారు. అలాగే జూన్3వ తేదీ లోపు గత ఏడాది ప్రణాళికలో మిగిలిన పనులపై అవగాహన చేసుకుని వాటిపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

——————————
పల్లె, పట్టణం ప్రగతి కార్యక్ర మాలను విజయవంతం చేయాలి*

– పల్లె ప్రగతి నీ పకడ్బందీ కార్యక్రమంగా చేపట్టాలి

– చేపట్టాల్సిన పనులను ముందే గుర్తించాలి

– ప్రమాదకర బోరు బావులు, ఓపెన్ బావులను పూడ్చి వేయాలి
– శిథిలావస్థ కు చేరి ప్రజా భద్రత కు ప్రమాదకరంగా మారిన కట్టడాలను కూల్చి వేయాలి

– పెండింగ్ బిల్లులను చెల్లింపులు చేస్తాం

– జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

——————————
పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టేందుకు , పచ్చదనం ను పెంపొందించేందుకు జూన్ 3 నుంచి చేపట్టే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం ను అందివచ్చిన అవకాశంగా భావించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

 

అన్ని గ్రామ పంచాయితీ పరిధిలో ఉన్న మొత్తం కుటుంబాలు, పంచాయతీ సిబ్బంది, గ్రామంలో ఉన్న రోడ్లు, మురుగు కాల్వలు, వీటిలో ప్రతిరోజూ శుభ్రం చేస్తున్న రోడ్లు, డ్రెయిన్లు, చదును చేసిన ప్రదేశాలు, ఇంకా పూడ్చాల్సిన ప్రదేశాలు, కూలిపోయిన, శిథిలావస్థకు చేరిన ఇండ్లు, వాటిలో పడగొట్టిన, తొలగించిన ఇండ్లు, ఇంకా పడగొట్టాల్సిన, తొలగించాల్సిన ఇండ్లు, పూడ్చిన బావులు, పూడ్చాల్సి ఉన్న బావులు, శుభ్రం చేసిన ఖాళీ స్థలాలు, ఇంకా శుభ్రం చేయాల్సిన ఖాళీ స్థలాలు, పూడ్చిన బోరు బావులు, పూడ్చాల్సి ఉన్న బోరు బావుల వివరాలను అధికారులు సిద్ధం చేసుకోవాలన్నారు. ఆలాగే గ్రామాల్లోని చెరువు కట్టలను బలోపేతం చేసుకోవాలన్నారు. కీటక కీటక జనిత వ్యాధులు రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు నీట్ నీరు నిలవ అ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు గ్రామాల్లోని బావుల్లో దోమలు వృద్ధి చెందకుండా వేల ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు ప్రతి గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంగన్వాడి కేంద్రాలు సబ్ సెంటర్లు ప్రభుత్వ కార్యాలయ భవనాలు అన్నింటిని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

శిథిలావస్థ కు చేరి ప్రజా భద్రత కు ప్రమాదకరంగా మారిన కట్టడాలను గుర్తించి కూల్చి వేయాలన్నారు.

గ్రామాల్లో ప్రధానంగా వంగిపోయిన, కూలిపోయిన విద్యుత్ స్తంభాలు, తుప్పు పట్టిన , దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను గుర్తించి వాటి స్థానంలో లో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సెస్ అధికారుల సమన్వయంతో కొత్తవి వేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు.

*ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడిస్ సత్య ప్రసాద్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్ గడ్డం నర్సయ్య, జడ్పీ సీఈవో గౌతమ్ రెడ్డి , జిల్లా పంచాయతీ అధికారి రవీందర్, డీఆర్‌డీఏ పీడీ మదన్ మోహన్, ఎంపిపిలు, జడ్పీటీసీలు, స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు.
——————————

Share This Post