పల్లె ప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం చేయడం మన అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్  అన్నారు.
5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు శుక్రవారం నాగర్ కర్నూలు  మండలంలోని శ్రీపూరం గ్రామాన్ని  కలెక్టర్ ఉదయ్ కుమార్  సందర్శించారు. పల్లె ప్రగతి మొదటిరోజు  కార్యక్రమాన్ని ప్రారంభించి పరిశీలించారు . గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను మన ఊరు మన బడి కార్యక్రమం కింద 12 లక్షల 59 వేల 892 రూపాయలతో చేపట్టనున్న పనులను పరిశీలించి వివరాలను ఉపాధ్యాయులతో అడిగి తెలుసుకున్నారు.
పాఠశాలలో చదువుతున్న 172 మంది విద్యార్థుల వివరాలతో పాటు తరగతి గదులు, మూత్రశాలల వినియోగం,నూతన నిర్మాణాలతో పాటు శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను పరిశీలించారు.
పల్లె ప్రకృతి వనంలో నాటిన వివిధ రకాల 1500 మొక్కలు వేపుగా పెరగడాన్ని గమనించి గ్రామ కార్యదర్శి అభినందించారు.
గ్రామ నర్సరీని సందర్శించి నర్సరీలో ఉన్న 37 రకాల పండ్లు, పూలు, తులసి కరివేపాకు బొప్పాయి తదితర రకాల 29,750 ముక్కలను కలెక్టర్ పరిశీలించారు.
గ్రామంలో ప్రతి కుటుంబానికి అవసరమైన మొక్కలను అందజేసి వాటిని సంరక్షించే లా చూడాలని సర్పంచ్ మైనుగాని నిరంజన్ ను కోరారు.
అలాగే 367 సర్వే నెంబర్లు ఒక ఎకరం స్థలంలో నిర్మిస్తున్న క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించి క్రీడా ప్రాంగణంలో మొక్కలు నాటారు.
అనంతరం మొదటి రోజు పల్లె ప్రగతి లో భాగంగా గ్రామంలో పాదయాత్ర నిర్వహించి గ్రామ పంచాయతీ కార్యాలయా ఆవరణ లో గ్రామసభ నిర్వహించి, గ్రామస్తులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ…. గత నాలుగు విడుతల పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం అయిన సందర్బంగా అదే స్పూర్తితో 5వ విడుతను ముందుకు తీసుకువెళ్లాలని కలెక్టర్ పేర్కొన్నారు.
గత ఎనిమిది సంవత్సరాలుగా గ్రామాల్లో జరుగుతున్న మార్పును ప్రజలు గమనించాలన్నారు.
శ్రీపురం రంగనాయక స్వామి దేవాలయంలో ఈ వారంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల కోసం దేవాలయం నుండి శ్రమదానం కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
గ్రామాలలో పచ్చదనం – పరిశుభ్రత ప్రధాన ఉద్దేశ్యంగా ప్రభుత్వం    ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు.
గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే అక్కడ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, అందుకు ప్రతి ఒక్కరు భాద్యతగా మెదిలి గ్రామ పరిశుభ్రతకు పాటుపడాలని అన్నారు .
ఇంట్లోని తడి, పోడి చెత్తను వేరు చేసి తడి చెత్తతో కంపోస్టు ఎరువు తయారు చేసుకోవాలని సూచించారు.
ప్రతి గ్రామం ఆదర్శ గ్రామంగా ఉండాలంటే గ్రామమంలోని ప్రజలందరూ  గ్రామాభివృద్దిలో స్వచ్చందంగా పాల్గొనాలని అన్నారు. స్పష్టమైన లక్ష్యాలతో పచ్చదనం, పరిశుభ్రత పెంపుకోసం  దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు వెళ్ళాలని సూచించారు.
పల్లె ప్రగతి లో చేపట్టిన పనులకుగాను విడుతల వారిగా నిధులు మంజూరు చేస్తున్నామని, ఇందుకు సంబంధించి ఖర్చుల వివరాలను పంచాయితీ సిబ్బందిని అడిగి తెలుసుకొనే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని అన్నారు.
ప్రతిసారి గ్రామం లో గ్రామ సభలు నిర్వహించి, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు ప్రతి పనిని చర్చించాలని అన్నారు. గ్రామాభివృద్ది కొసం నిర్ణయాలు తీసుకునే ముందు చర్చ జరగాలన్నారు . 5వ విడుత పల్లె ప్రగతి కార్యక్రమం పూర్తి అయ్యేలోగా ప్రతి ఇంటి ముందర పచ్చని చెట్లు పాటు ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పల్లెప్రగతిలో మహిళలు మరింత చొరవ తీసుకోవాలని సూచించారు. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు.
రోడ్ల వెంట నాటిన మొక్కలను సంరక్షించడంతో పాటు కంచెలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అంతకుముందు ఎంపీడీవో కోటేశ్వర్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సందేశాన్ని గ్రామ ప్రజలకు చదివి వినిపించారు.
పల్లె ప్రగతి కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ ను వార్డు మెంబర్ గంధం ప్రసాద్ శాలువాతో సత్కరించారు.
కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ మను చౌదరి, పి డి డిఆర్డిఎ నర్సింగరావు, ఆర్డిఓ నాగలక్ష్మి, ఎంపీడీవో కోటేశ్వర్, సర్పంచ్ నిరంజన్, గ్రామ కార్యదర్శి సంధ్య, ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి, వార్డ్ మెంబర్ గంధం ప్రసాద్, వివిధ శాఖల గ్రామ స్థాయి మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post