పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

జులై 06, 2021ఆదిలాబాదు:-

జిల్లాలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమానికి ప్రజల భాగస్వామ్యం ప్రజాప్రతినిధుల సహకారంతో విజయవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం రోజున జైనథ్, బేల మండలాల్లో పర్యటించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జులై ఒకటి నుండి ప్రారంభమైన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో ప్రజలు భాగస్వాములు అవుతున్నారని, ఖాళీగా ఉన్న స్థలాల్లో విస్తృతంగా మొక్కలు నాటడం లో ప్రజలు భాగస్వాములు అవుతున్నారని, ఈ పది రోజుల పాటే కాకుండా నిరంతరం గ్రామాలు, పట్టణాల్లో ప్రగతి పనులు నిర్వహించుకోవాలని అన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలనీ అన్నారు. జైనథ్ మండలం లేఖర్ వాడాలో ఆదిలాబాద్ శాసన సభ్యులు జోగు రామన్నతో కలిసి మొక్కలను నాటి, నర్సరీలను, పల్లె ప్రకృతి వనాలను, సేగ్రిగేషన్ షెడ్, వైకుంఠధామం లను పరిశీలించారు. గ్రామంలో ఇంటింటికి పంపిణి చేసే ఆరు మొక్కల వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలనీ పంచాయితీ కార్యదర్శిని కలెక్టర్ ఆదేశించారు. గ్రామంలో శానిటేషన్ కార్యక్రమాలను పరిశీలించి చెత్తను తొలగించాలని ఆదేశించారు. ప్రతి ఫ్రైడే ను డ్రై డే గా నిర్వహించాలని సూచించారు. ఆరు మొక్కల పంపిణి చేసిన పెబ్బత్ విట్టల్ ఇంటిలో మొక్కలను పరిశీలించి వాటిని సంరక్షించాలని అన్నారు. నర్సరీలలో పెద్ద మొక్కలను పెంచాలని అన్నారు. లేఖర్ వాడ గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని కలెక్టర్ ప్రారంభించి, నర్సరీని పరిశీలించిన అనంతరం ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ ను సందర్శించి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుతో పాఠశాల విద్య బోధన్, ఆన్లైన్ తరగతులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. పాఠశాల విద్యార్ధి జాన్సీ ని ఆన్లైన్ తరగతులపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేశారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో పర్యటించి మురికి కాలువలను, రోడ్ల స్థితులను పరిశీలించి ఎప్పటికప్పుడు చెత్తను తొలగించే విధంగా ప్రతి రోజు పర్యవేక్షించాలని పంచాయితి కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం రోడ్లు భవనాల శాఖ అధీనంలోని రోడ్లకు ఇరువైపులా మల్టి లేయర్ క్రమంలో మొక్కలను నాటి సంరక్షించాలని అన్నారు. అనంతరం జైనథ్ సబ్ స్టేషన్ లో కలెక్టర్ మొక్కను నాటారు. బేల మండల కేంద్రం లో 33/11 కెవి సబ్ స్టేషన్ లో కలెక్టర్ మొక్కలను నాటారు. బేల గ్రామానికి చెందిన సమస్యలు గ్రామస్థులు కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, మండలాల ప్రత్యేక అధికారులు పుల్లయ్య, శంకర్, ఎంపీపీ లు గోవర్ధన్, వనిత, బేల జడ్పీటీసీ అక్షిత పవర్, రైతుబంధు మండల కన్వీనర్ లింగారెడ్డి, ఎంపీడీఓ లు గజానంద్, మహేందర్, తహసీల్దార్ మహేందర్, సర్పంచ్ లు, పంచాయితీ కార్యదర్శులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….  జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post