పల్లె ప్రగతిలో భాగంగా పెబ్బేరు, కంచిరావుపల్లి నర్సరీలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
తేది:04.06.2022, వనపర్తి.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 5వ విడత పల్లె ప్రగతి, 4వ. విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రణాళికలకు ఏర్పాటు చేసినట్లు, అధికారులు జూన్ 18వ తేదీలోగా కేటాయించిన పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.
శనివారం పెబ్బేరు మండల పరిధిలోని పెబ్బేరు, కంచిరావుపల్లి నర్సరీలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 255 గ్రామ పంచాయతీలలో, 5 మున్సిపాలిటీలలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆమె తెలిపారు. 5వ. విడత పల్లె ప్రగతి, 4వ. విడత పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించటం జరిగిందని, ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆమె అన్నారు. రోజువారి ప్రణాళికలు సిద్ధం చేసి ఇవ్వటం జరిగిందని, దాని ప్రకారం పనులు పూర్తి చేయాలని ఆమె సూచించారు. వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, వైకుంఠ ధామా.లు, హరితహారం, నర్సరీలు, క్రీడా ప్రాంగణాలను   పరిశీలించి, జూన్ 18వ తేదీలోగా పనులు పూర్తి చేయాలని ఆమె తెలిపారు.
వనపర్తి జిల్లాలో అడవులు తక్కువగా ఉన్నందున హరితహారం ద్వారా చెట్లను విరివిగా పెంచాలని, నర్సరీలలో ఉన్న మొక్కలను పెంచి వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని, ప్రభుత్వ భూములలో, ఖాళీ స్థలాలలో, ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాల ఆవరణలో, అదే విధంగా ప్రతి ఇంటిలో మొక్కలు నాటాలని ఆమె తెలిపారు. ప్రతి మున్సిపాలిటీలో సెగ్రెగేశన్ షెడ్లు ఏర్పాటు చేసి, తద్వారా చెత్తను వేరు చేయాలని ఆమె సూచించారు. గ్రామాలలో, పట్టణాలలోని సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చూడాలని, జూన్ 18వ తేదీలోగా పనులు పూర్తి చేయాలని గ్రామ, పట్టణ అభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, కృషి చేయాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
…………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post