పల్లె ప్రగతిలో రోజువారిగా చేపడుతున్న పనులతో గ్రామాలను అభివృద్ధి అభివృద్ధిపర్చుకోవాలని, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైకుంఠ దామాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ కమీషనర్ డా. శరత్ అన్నారు.

పల్లె ప్రగతిలో రోజువారిగా చేపడుతున్న పనులతో గ్రామాలను అభివృద్ధి అభివృద్ధిపర్చుకోవాలని, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైకుంఠ దామాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ కమీషనర్ డా. శరత్ అన్నారు.

శుక్రవారం వికారాబాద్ జిల్లా పూడూర్ మండలంలోని గోంగుపల్లి, వికారాబాద్ మండలంలోని కామారెడ్డిగూడలో జిల్లా కలెక్టర్ నిఖిలతో కలిసి గ్రామాలలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైకుంఠదామాలు, సెగరిగేషన్ షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు,హరితహారం నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, గ్రామాలలో ప్రతిరోజు పారిశుధ్య పనులతో పాటు తడి పొడి చేత్త సేకరణ జరగాలన్నారు. రాబోవు వర్షాకాలంలో దోమలు, వ్యాధులు ప్రబలకుండా ప్రతిరోజు మురుగు కాలువలు శుభ్రం చేస్తుండాలని సూచించారు. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులకు తరలించి
సెగ్రీ గేషన్ షెడ్లలో ఎరువులు తయారీ సక్రమంగా చేపట్టాలన్నారు. పక్షం రోజుల పాటు నిర్వహిస్తున్న పల్లె ప్రగతిలో గ్రామాలన్నీ అభివృద్ధి చెందాలని అన్నారు. గోంగూపల్లి గ్రామంలో వైకుంఠదమంలో మురుగు కాలువ సరిగా లేనందున అట్టి కాలువను పైప్ లైన్ ద్వారా మురుగు నీటిని తరలించాలన్నారు. మిషన్ భగీరథ నీటిని వృధా చేయకుండా త్రాగడానికి వినియోగించాలని గ్రామ ప్రజలకు సూచంచారు.

వికారాబాద్ మండలం, కామారెడ్డిగూడలో పల్లె ప్రకృతి వనం, హరితహారం నర్సరీ, తెలంగాణ క్రీడా మైదానన్ని పరిశీలించారు. పల్లె ప్రగతిలో చేపడుతున్న రోజు వారి పనులను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్యం, రోడ్ల పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలన్నారు. గ్రామ కార్యదర్శులు చురుకుగా పని చేయాలని అన్నారు. హరితహారంలో విస్తృతంగా మొక్కలు నాటాలని సూచించారు. తెలంగాణ క్రీడా ప్రాంగణం, పల్లె ప్రకృతి వనం, నర్సరీలను పరిశీలించిన అనంతరం సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిలతో పాటు జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, డిప్యూటీ సీఈఓ సుభాషిణి, డి ఆర్ డి ఓ కృష్ణన్, డీపీవో మల్లారెడ్డి, ఎంపీడీఓ లు, గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

 

 

Share This Post