పల్లె ప్రగతి కార్యక్రమంలో నిర్లక్షం వహిస్తున్న సర్పంచులకు నోటిసులు జారి చేయాలనీ జిల్లా కలెక్టర్ మను చౌదరి జిల్లా పంచాయతి అధికారిని ఆదేశించారు.

పత్రికా ప్రకటన
తేది: 16-8-2021
నాగర్ కర్నూల్ జిల్లా
పల్లె ప్రగతి కార్యక్రమంలో నిర్లక్షం వహిస్తున్న సర్పంచులకు నోటిసులు జారి చేయాలనీ, ఇప్పటికే నోటీసులు జారి చేసినప్పటికిని స్పందించని సర్పంచులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారి చేయాలనీ జిల్లా కలెక్టర్ మను చౌదరి జిల్లా పంచాయతి అధికారిని ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టర్ సమావేశ మందిరంలో పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలపై మండల అభివృద్ధి అధికారులు, మండల పంచాయతి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హరితహారం, వైకుంట ధామం, సేగ్రేగేషన్ షెడ్ల నిర్మాణం, పారిశుధ్యం తదితర అంశాలపై మండలం వారిగా సమీక్షా నిర్వహించారు. వైకుంట ధామం, సేగ్రేగేషన్ షెడ్ల నిర్మాణం ఇప్పటి వరకు పూర్తి చేయని గ్రామాల సర్పంచులకు ఇదివరకే నోటిసులు ఇచ్చి ఉంటె అలాంటి వారిని వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారి చేయాలన్నారు. నోటిసులు ఇవ్వని వారికి వెంటనే నోటీసు జారి చేయాలని ఆదేశించారు. మిగిలిపోయిన చిన్న చిన్న పనులు ఉంటె వారం రోజుల్లో పూర్తి చేసి ఆన్లైన్ లో నోమోడు చేయాల్సిందిగా సూచించారు. హరిత హారం పై మాట్లాడుతూ ఇప్పటి వరకు తవ్విన గుంతల్లో మొక్కలు నాటి పూర్తి చేయాలనీ మిగిలినవి వెనువెంటనే గుంటలు తవ్వి మొక్కలు నాటవలసిందిగా ఆదేశించారు. వాతావరణం అనుకూలంగా ఉన్నందున యుద్ధ ప్రాతిపదికపై మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేసి ఆన్లైన్ లో మస్టర్ అప్లోడ్ చేయల్సినదిగ ఆదేశించారు. ఆన్లైన్ లో నోమోడు ప్రక్రియకు మండల అభివృద్ధి అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. వచ్చే వరం తదుపరి సమీక్షా సమావేశం వరకు మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి కావాలని ఆదేశించారు. పల్లె ప్రక్రుతి వనాలకు సంబంధించి ఇంకా 31 ఆన్లైన్ నమోదు కాకుండా ఉండటం తో చెల్లింపులు జరుగలేదని వాటిని వెంటనే ఆన్లైన్ చేసి చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయాలనీ తెలియజేసారు. రైతు కల్లాల విషయంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు పేరు నమోదు చేసుకొని కల్లాల ఏర్పాటుకు ఆసక్తి చూపించని వారి పేర్లు తొలగించి వాటి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించే విధంగా మార్పు చేర్పుల నివేదికను ఎల్లుండి సాయంత్రంలోగా సమర్పించాలని సూచించారు. పూర్తి అయిన సేగ్రేగేషన్ షెడ్లలో సేంద్రియ ఎరువులు ఎన్నింటిలో తాయారు చేస్తున్నారని అడుగగా దాదాపు 80 శాతం షెడ్లలో సేంద్రియ ఎరువులు తాయారు చేస్తున్నారని మండల అభివృద్ధి అధికారులు సమాధానం ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి తనిఖి చేస్తానని ఒకవేళ అందుకు భిన్నంగా కనిపిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రతి గ్రామ బహుళ కార్మికునికి బ్యాంకు ఖాతా తెరిపించి అందరికి భీమ సౌకర్యం కల్పించాలని, వచ్చే వారం రోజుల్లో జిల్లాలోని అందరు బహుళ కార్మికులకు భీమ కార్యక్రమం పూర్తి కావాలని ఆదేశించారు. గ్రామ పంచాయతి అధినంలో గల వివిధ విద్యుత్ కేనేక్షన్లు విద్యుత్ శాఖ వారు సూచించిన విధంగా ఉన్నాయా లేక అవసరం లేనివి తొలగించాలా అనేది పరిశీలించి గ్రామం వారిగా మొత్తం ఎన్ని గ్రామ పంచాయతి విద్యుత్ మీటర్లు ఉన్నాయో వారం రోజుల్లో నెంబర్లతో సహా నివేదిక ఇవ్వాలని డివిజినల్ పంచాయత్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం పేద వారికి ఇచ్చే ఆసరా పెన్షన్ వయస్సు ను 57 సంవత్సరాలకు కుదిన్చినందున అర్హుడైన ప్రతి ఒక్కరు ఆగస్టు 31 తేది లోగా మీసేవ లో దరఖాస్తు చేసుకునే విధంగా అన్ని గ్రామ పంచయతిల్లో టాం టాం చేయించాలని ఆదేశించారు.
పి.డి. డి.ఆర్.డి.ఎ. నర్సింగ్ రావు, డి.పి.ఒ రాజేశ్వరి, అందరు డివిజినల్ పంచాయత్ అధికారులు, మండల అభివృద్ధి అధికారులు, ఎంపిఒ లు తదితరులు పాల్గొన్నారు.
—————————
జిల్లా పౌర సంబంధాల అధికారి ద్వారా జారి.

Share This Post