పల్లె ప్రగతి కార్యక్రమంలో Utkoor మండలం లో పలు గ్రామాలను తనిఖీ చేసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి k. వనజ అంజనేయులు గౌడ్

పల్లె ప్రగతి కార్యక్రమంలో Utkoor మండలం లో పలు గ్రామాలను తనిఖీ చేసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి k. వనజ అంజనేయులు గౌడ్ గారు.. ఇందులో భాగంగా Utkoor గ్రామం లోని పల్లె ప్రకృతి వనం, నర్సరీ ని సందర్శించి శ్రమదానం లో పాల్గొన్నారు. బిజ్వార్, నాగిరెడ్డి పల్లి గ్రామలలో  నూతనంగా ఏర్పాటు చేస్తున్నా తెలంగాణ క్రీడా ప్రాంగణాలకూ భూమి పూజను నిర్వహించారు.. బీజ్వార్ గ్రామంలో నూతనంగా నిర్మించిన  రైతు బజారు ను సందర్శించి , దాని ప్రాంగణం లో మొక్కలు నాటారు.. ప్రతి గ్రామం లో ఉపాధి హామీ నిధులను ఉపయోగించుకొని ఇలాంటి రైతు బజార్ లు నిర్మించు కుంటే రైతులకు చాలా మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి నర్సరీ లో పెంచే మొక్కల పేర్లతో బోర్డు లు ఏర్పాటు చెయ్యలని, బెడ్స్ లో కలుపు లేకుండా చూసుకోవాలని, రెగ్యులర్ గా వాటరింగ్ చెయ్యాలని ఆదేశించారు. శ్రమ దానం లో పాల్గొన్న మహిళా సంఘాల సభ్యులను అభినందించారు.

 

జిల్లాలో లోని అన్ని గ్రామాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతంలోని యువత చదువుతోపాటు, ఆరోగ్యంగా ఉండేలా చూసేందుకు మన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం క్రీడా ప్రాంగణలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు.

ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడమే కాకుండా, వాలీబాల్ గ్రౌండ్ ,షటిల్   గ్రౌండ్, కోకో, కబడ్డీ తో పాటు, వాటికి అవసరమైన పోల్స్,  ఇతర క్రీడా సామాగ్రిని అందజెయ్యడం జరుగుతుంది అని, గ్రామీణ యువత ఆటపాటలతో సంతోషంగా గడపాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగా వీటిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.  జిల్లాలో అన్ని గ్రామాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నాం అని, క్రీడల వల్ల చదువుతోపాటు, క్రమశిక్షణ వస్తుందని, ప్రతి క్రీడా ప్రాంగణం చుట్టూ బయో ఫెన్సింగ్ వెయ్యాలని  అధికారులను ఆదేశించారు. మక్తల్ నియోజక వర్గం మన ఎమ్మెల్యే శ్రీ చిట్టం రామన్న గారి కృషి తో  గ్రామాలు బాగా అభివృద్ధి జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం లో

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీ చంద్ర రెడ్డి గారు,జిల్లా పరిషత్ సీఈఓ శ్రీ సిద్ది రామప్ప గారు, ఎంపిడిఓ కాలప్ప గారు , Utkoor సర్పంచ్ శ్రీ సూర్య ప్రకాష్ రెడ్డి గారు, ఆయా గ్రామ ఇతర సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు  తదితరులు పాల్గొన్నారు.

Share This Post