పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి

పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి

గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పల్లె ప్రగతి లో పనులు చేయాలి – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

గ్రామాల అభివృద్ధికి సర్పంచుల సేవలు మరవలేనిది – ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

నేటి నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే పల్లె, పట్టణ ప్రగతి, కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు సమష్టిగా కృషి చేయాలని నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య సూచించారు.. అధికారులందరూ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని, స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ‘పల్లె, పట్టణ ప్రగతి, కార్యక్రమాలపై కలెక్టర్‌ పి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ లోని రూబీ గార్డెన్ లో జిల్లా అధికారులు, సర్పంచులు, కార్యదర్శులతో   నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు..
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించి పల్లెల రూపురేఖలను మారుస్తున్నారని అందుకు తగ్గట్లుగానే సర్పంచులు అధికారులు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ….
పల్లె ప్రగతి లో రాష్ట్రం లోనే జిల్లాను ముందుంచామని, ఐదవ విడతలో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం, పరిశుభ్రతకు పాటుపడాలన్నారు.  3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహిస్తామని, మండలాలకు ఇచ్చి న లక్ష్యాలను కచ్చితంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రతి గ్రామంలో కమిటీలను ఏర్పాటు చేశామని, గ్రామ అధ్యక్షుడిగా సర్పంచులు, సభ్యులుగా ప్రజాప్రతినిధులు, కార్యదర్శులు, లైన్‌మెన్‌ ఉంటారన్నారు. మండల స్థాయిలో ప్రత్యేకాధికారి ఉంటారని, అధికారులు గ్రామాల్లో పర్యటించి సమస్యలను గుర్తించాలని, ఏ సమస్యనా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. రహదారి వెంబడి మూడు వరుసల్లో మొక్కలు నాటాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ప్రాజెక్టుల ఖాళీ స్థలాలు, కుంటలు చెరువుల గుట్టలపై మొక్కలు పెంచాలన్నారు. స్వచ్ఛభారత్‌లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. వైకుంఠధామాలను వాడుకలోకి తేవాలన్నారు. గ్రామాల్లో చెత్త సేకరణ నిరంతర ప్రక్రియ అని, సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డు లకు తరలించి తడి పొడి చెత్తను వేరు చేయాలని, గ్రామంలో వైకుంఠధామాల్లో విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేయాలని, పాఠశాలలు, పీహెచ్‌సీలు, గ్రామపంచాయతీలను పారిశుధ్య కార్మికుల ద్వారా రోజు శుభ్రం చేయించాలన్నారు. ఎంపీడీవోలు, ఎంపీవోలు గ్రామపంచాయతీల ద్వారా పాఠశాలల్లో విద్యుత్‌ లైట్లను ఏర్పాటు చేయాలన్నారు.
జిల్లాలోని 461 గ్రామపంచాయతీలు, 4 మున్సిపాలిటీల్లో పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వర్తించేందుకు ప్రజల భాగస్వామ్యం తీసుకోవాలన్నారు.
నాగర్ కర్నూల్ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ…..
పల్లెల అభివృద్ధికి సర్పంచులు ఎనలేని కృషి చేస్తున్నారని వారి కృషికి నిదర్శనమే
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ గ్రామాల్లో తొలి 10కి పది, 20లో 19 పల్లెలు రాష్ర్టానివే కావడం గర్వకారణమని ఆయన అభిప్రాయపడ్డారు. వీటన్నింటికీ పల్లె ప్రగతిలో చేసిన కార్యక్రమాలే గీటురాళ్లని, అందుకు సీఎం కేసీఆర్‌ నాయకత్వమే కారణమని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్‌ కేవలం ఎనిమిదేండ్లలోనే ఎన్నో పథకాలతో రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. పథకాల అమలులో కలెక్టర్‌ నుంచి గ్రామస్థాయి అధికారుల పాత్ర అభినందనీయమన్నారు.
స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల మధ్యలో ఉంటూ నిత్యం అభివృద్ధికి పరితపిస్తున్నారని, వారి చిత్తశుద్ధి, సేవలు ప్రశంసనీయమని అన్నారు.
సర్పంచులకు కొన్ని ఇబ్బందులు ఎదురైనా మాట వాస్తవమేనని అయినప్పటికీ వారి ప్రాధాన్యత ఇచ్చేలా గ్రామపంచాయతీలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.
జిల్లాకు అధిక నిధులు వస్తున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ…
పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాల వివరాలను వివరించారు.
పల్లె ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
అంతకుముందు గత పల్లె ప్రగతి లో గ్రామాలను అభివృద్ధి పరిచిన సర్పంచులకు జిల్లా పరిషత్ చైర్మన్ కలెక్టర్ చేతుల మీదుగా 55 గ్రామాల సర్పంచులు కార్యదర్శులకు శాలువా మెమొంటో లతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో 4 మున్సిపాలిటీల మున్సిపల్ చైర్మన్లు, గ్రంధాలయ చైర్మన్ హనుమంతరావు, డిపిఓ కృష్ణా, సీఈవో ఉష, జడ్పీటీసీలు ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post