పల్లె ప్రగతి కార్యక్రమాలలో మండల స్పెషల్ ఆఫీసర్లు తప్పకుండా ప్రతిరోజు ఉదయం 8:30 గంటలకు గ్రామాలలో హాజరు కావాలని జిల్లా కలెక్టర్ నిఖిల…

పల్లె ప్రగతి కార్యక్రమాలలో మండల స్పెషల్ ఆఫీసర్లు తప్పకుండా ప్రతిరోజు ఉదయం 8:30 గంటలకు గ్రామాలలో హాజరు కావాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయం లోని కాన్ఫరెన్స్ హాల్ నుండి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఎంపీడీఓ, తహసీల్దార్, మున్సిపల్ కమీషనర్లు, స్పెషల్ ఆఫీసర్లు, ఎ పి ఓ లు, ఎంపీవో లు, ఈసీ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు గ్రామాలలో, మున్సిపల్ వార్డులలో గల్లీ గల్లీ తిరిగి సమస్యలు గుర్తించి పరిష్కరించాలని తెలిపారు. గ్రామ కమిటీలన్ని కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలన్నారు. ఎలక్ట్రిసిటీ, మిషన్ భగీరథ సిబ్బంది పేర్లు వారి ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచుకొవలన్నారు. అన్ని గ్రామ పంచాయతీలలో ఉండాల్సిన 33 రిజిస్టర్లు, NREGS కు సంబందించిన 7 రిజిస్టర్లు అందుబాటులో ఉండాలన్నారు. Annexure – III మరియు IV వివరాలు బ్లాక్ బోర్డుపై లేదా ఫ్లెక్సీ పై రాసి ఉంచాలని ఆదేశించారు. గ్రామాలలో చేత్త సేకరణ ప్రతి రోజు చేపట్టి డంపింగ్ యార్డ్ లకు తరలించాలని, అలాగే సెగ్రీగేషన్ షెడ్లలో సెగ్రీగేషన్ పనులు చేపట్టి ఎరువులు తయారు చేయాలన్నారు. ప్రతి రోజు గ్రామాలలో మేజర్ & మైనర్ పనులను గుర్తించి అట్టి వివరాలు తెలియపర్చాలని సూచించారు. అన్ని గ్రామాలలో తెలంగాణ క్రీడా ప్రాంగణాల కొసం స్థలాలను గుర్తించి ఈనెల 18 వరకు సిద్ధం చేయాలని ఆదేశించారు. వైకుంఠ దామాలలో అవసరం మేరకు విద్యుత్, నీటి సదుపాయం ఏర్పాట్లు పూర్తి చేసి వినియోగం లోకి తీసుకోరావాలన్నారు. ప్రతి రోజు మురికి కాలువలు, రోడ్లను పరిశుభ్రం పనులు చేపట్టాలని, గ్రామాలలో పడబడిన బావులు, బోర్లు, పాత ఇండ్లను గుర్తించి పూడ్చివేయాలని సూచించారు. ప్రతి నెల 3 సార్లు, వాటర్ ట్యాంకులను పరిశుభ్రం చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ కొరకు గుంతలు త్రవ్వే పనులను ఈ 15 రోజులలో చేపట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులను సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారులు విజయకుమారి, డిప్యూటీ సీఈఓ సుభాషిణి, డీపీవో మల్లారెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post