పల్లె ప్రగతి తో గ్రామాల రూపురేఖల్లో మార్పు


పల్లె ప్రగతి తో గ్రామాల రూపురేఖల్లో మార్పు

గ్రామాలు పచ్చదనంతో కళకళ లాడుతున్నాయి

పల్లె ప్రగతి తో గ్రామాలు బాగుపడ్డాయి

వచ్చే నెల నుండి 57 ఏళ్లు నిండిన వారికి కొత్త పింఛన్లు

రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు

00000

   పల్లె ప్రగతి కార్యక్రమం తో గ్రామాల రూపురేఖల్లో మార్పు వచ్చిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

     5వ విడత పల్లె ప్రగతి లో భాగంగా కరీం నగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని మంత్రి గంగుల కమలాకర్, జెడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం ప్రారంభించి మంత్రులు వాలీ బాల్ ఆడారు. క్రీడా ప్రాంగణంలో మంత్రులు మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో సీఎం కెసిఆర్ లాంటి సీఎం ని చూడలేదన్నారు.కెసిఆర్ లా రైతులకు దేశంలో ఎవరూ చేయడం లేదని అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇలాంటి పథకాలు ఉన్నాయా అన్నారు.కేంద్రం ఉపాధి హామీ,15వ ఆర్థిక సంఘం నిధులు బాకీ పడ్డదని, రాష్ట్రం ఇవ్వాల్సిన నిధులు నయా పైసా బాకీ లేకుండా ఇచ్చామని తెలిపారు. తెలంగాణ రాక పూర్వం గ్రామాల్లో వ్యవసాయ మోటార్లు,ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఉండేదని, దేశంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు. రైతు బంధు పథకం కింద ఎకరానికి 1000/- అందిస్తున్నామన్నారు. గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించడం జరిగిందన్నారు దీనికోసం 165 కోట్లు రిలీజ్ చేయడం జరిగిందన్నారు. కరోనా సమయంలో పింఛన్లు ఇచ్చామన్నారు. వచ్చే నెల నుండి 57 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.  పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు బాగుపడ్డాయని ,గ్రామాల్లో సమస్యలు పరిష్కరిస్తున్నాం అన్నారు. పల్లె ప్రగతి తో గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగైందని దీంతో గ్రామాల్లో రోగాలు మటు మాయం అయ్యాయని మంత్రి అన్నారు. గ్రామ పంచాయతీలుతమకు ఇష్టం వచ్చిన పనులు చేసుకునే అవకాశం కల్పించామని అన్నారు.దేశానికి గాంధీ స్వాతంత్య్రాన్ని తెస్తే, తెలంగాణ కు స్వాతంత్ర్యాన్ని తెచ్చింది తెలంగాణ గాంధీ కెసిఆర్ అన్నారు.తెలంగాణ కోసం తన ప్రాణాలు ఫణంగా పెట్టిన కెసిఆర్ కు మనమంతా అండగా ఉండాలన్నారు. మహిళలు మంచి ప్రాజెక్ట్ తో వస్తె వాళ్లకు స్త్రీ నిధి నుంచి డబ్బులు ఇప్పిస్తామని తెలిపారు.  మల్కా పూర్ ఇప్పటికే 5 కోట్ల రోడ్లకు ఇచ్చామని,మరిన్ని పనులకు కావల్సినన్ని నిధులు ఇస్తామన్నారు. మల్కాపూర్ గ్రామానికి కోటి రూపాయల నిధులు ఇస్తామన్నారు.

     రాష్ట్ర బిసి సంక్షేమ మరియు పౌరసరఫరాల శాఖా మాత్యులు గంగుల కమలాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకప్పుడు త్రాగడానికి మంచునీరు లేక చెరువులు, చెలమలల్లో నీటిని త్రాగి విషజ్వరాలు, గత్తర వచ్చి తీవ్ర రోగాలబారిన పడేవారని ఈ పరిస్థితికి శాశ్వత పరిష్కారంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం మిషన్ భగీరథ కారక్రమాన్ని ప్రారంభించి ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీటిని అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి పేదింటికి మేనమామగా మారి పెండ్లి ఖర్చుల కొరకు లక్షా 116 రూపాయలను అందించి, తొలికాన్పుకు కేసీఆర్ కిట్ ఇవ్వడంతో పాటు 13వేలు ఇవ్వడం తో పాటు వారికి మెరుగైన విద్యను అందించడానికి గురుకులాలను ప్రాంభించుకోవడం జరిగిందని అన్నారు. యావత్ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని, ఒకప్పుడు పొలాలకు నీళ్ళు పెట్టడానికి వెలితే సరైన కరెంట్ ఉండేది కాదని దీనికారణంగా పూర్తిస్థాయిలో రైతులు పూర్తిస్థాయిలో పంటను పండించేవారు కాదని, దేశానికే అన్నంపెట్టే రైతన్న పంటను పండించడానికి కష్టపడరాదని రాష్ట్రంలో 24 గంటల కరెంట్ , మిషన్ భగీరథ ద్వారా నీటిని, పంట సహాయంగా రైతుబందును అందించడం జరిగిందని, పండించిన చివరి గింజను కొనుగోలు చేసి నేరుగా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమచేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ సమాజం కడుపునిండా అన్నం పెట్టినవారికి మంచిగ బతకాలె, కడుపు చల్లగుండా నిండునూరేళ్లు బతకాలని దీవెనార్థులు ఇస్తామని, నేడు గౌరవ సీఎం కేసీఆర్ గారు మనం చల్లగ బతికేలా ఉచిత కరెంటు, కాళేశ్వరం నీళ్లు, రైతుబందు, రైతుబీమా, ఆసరా ఫించన్లు, కళ్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్లు ఇలా ఎన్నో పథకాలు ఇచ్చారని ఆయన నిండు నూరేళ్లు చల్లగ బతికి మనలాంటి ఎందరో తెలంగాణ బిడ్డల్ని చల్లగ చూసుకోవాలని దీవెనార్థులు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రి గంగుల కమలాకర్.

    జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమం తో గ్రామాల్లో పారిశుధ్యం మెరుగైందని దీంతో గ్రామాల్లో డెంగ్యూ, విష జ్వరాలు తగ్గినవి అన్నారు.పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు దేశంలో ఎక్కడ లేవని అన్నారు.  పల్లె ప్రగతి ప్రజాస్వామ్యంలో అత్యంత అద్భుత కార్యక్రమం అన్నారు.

     ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, జెడ్పీ సీఈఓ ప్రియాంక, అభివృద్ధి అధికారి శ్రీలత, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, జెడ్ పి టి సి పి., ఎంపీపీ లక్ష్మయ్య సర్పంచ్ కొట్టే జ్యోతి పోచయ్య స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు
అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, జెడ్పీ సీఈఓ ప్రియాంక, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు.

Share This Post