పల్లె ప్రగతి తో గ్రామ అభివృద్ధికి పాటు పడాలి….రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.

పల్లె ప్రగతి తో గ్రామ అభివృద్ధికి పాటు పడాలి….రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.

ప్రచురణార్థం

పల్లె ప్రగతి తో గ్రామ అభివృద్ధికి పాటు పడాలి….రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.

కేసముద్రం,
మహబూబాబాద్ జిల్లా, జూన్ -03:

పల్లెల్లోని ప్రజలు గ్రామాలను అభివృద్ధి చేసుకొనుటకు పల్లె ప్రగతితో ఊరు బాగుకై పాటు పడాలనీ రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

శుక్రవారం మధ్యాహ్నం 5విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా కేసముద్రం మండలం కల్వల జడ్ పి ఎస్ ఎస్ పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ కె. శశాంక, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ లతో కలిసి పాల్గొన్నారు.

మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, గ్రామ ప్రజల అభిప్రాయాలను సేకరించి వారికి అవసరమగు చేయవల్సిన పనుల్ని పల్లె ప్రగతి లో చేపట్టాలని, గతంలో చేసిన పనులు, సాధించిన పురోగతి, మిగిలి ఉన్న సమస్యలను పరిష్కరించుకోని, గ్రామ అభివృద్ధి కై ప్రతి ఒక్కరూ సమిష్టి కృషితో భాగస్వాములై పలు అభివృద్ధి పనులను చేపట్టాలని మంత్రి గ్రామ ప్రజలకు సూచించారు.

పోరాడి సాధించిన స్వరాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలను ఏర్పాటు చేసుకొని ప్రజల వద్దకు పాలనగా జిల్లా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేయడంలో అధికారులు, నాయకులు అందుబాటులో ఉంటున్నారని మంత్రి తెలిపారు. జిల్లాను ఏర్పాటు చేసుకుని గడిచిన 8 సంవత్సరాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్నమని, మెడికల్, నర్సింగ్ కాలేజ్ లు, జిల్లా కోర్ట్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సముదాయం లాంటి మొదలైన మానుకోటకె తలమానికమైన నిర్మాణాను పూర్తి చేసుకోబోతున్నామని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఆదర్శవంతమైన పాలన ప్రజలకు అందిస్తుందని రైతు క్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పని చేస్తుందని, కాలేశ్వరం జలాలను అందిస్తూ, ఎస్ ఆర్ ఎస్ పి జలాలను ప్రతి ఎకరాకు పారిస్తూ, 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ను అందించడం, రైతుబంధు, రైతు బీమా లాంటి ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా గ్రామాల అభివృద్ధి కై పటిష్టమైన వ్యవస్థను అవలంబిస్తుoదని మంత్రి అన్నారు.

కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల వాటాను ఇవ్వకుండా సమస్యలు సృష్టిస్తుందని, ప్రజలు గమనించాలని తెలిపారు. కొన్ని రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.

తండాలకు కనెక్టివిటీ రోడ్లను ఏర్పాటు చేస్తున్నామని, హరితహారంలో నాటిన ప్రతి మొక్కను కాపాడాల్సిన పూర్తి బాధ్యత మనదేనని, 33 శాతం ఉండాల్సిన అడవులు క్రమేణా తగ్గినాయని, ఆక్సిజన్ లేకుంటే ప్రాణకోటికి మనుగడే లేదని అందుకే బాధ్యతగా మొక్కలు విరివిగా పెంచాలని, మన ఊరు మన బడి లో భాగంగా ప్రతి విద్యార్థి మన ప్రభుత్వ బడిలోనే చదివే విధంగా ప్రైమరీ స్కూల్ లకు, ప్రతిపాదనలు వచ్చిన ఉన్నత పాఠశాలలకు నిధులు కేటాయిస్తున్నట్లు ప్లేగ్రౌండ్, ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అర్హులైన ఉపాధ్యాయుల చేత విద్యా బోధన పాఠశాలలో ప్రవేశపెట్టబోతున్నామని, ఒకే చోట అంగన్వాడి, తల్లీబిడ్డల సంక్షేమానికై, కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి ఆదర్శవంతమైన సంక్షేమ పథకాలను అందిస్తూ ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని, అధికారులు ప్రజలు నాయకులు, గ్రామ పాలక వర్గం ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు గ్రామంలో చేపట్టనున్న పనులను, గతంలో చేసిన పురోగతిని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని పల్లె ప్రగతి లో కల్వల గ్రామానికి అదనంగా మంత్రి సిడిఎఫ్ నిధుల నుండి 5 లక్షల రూపాయలు అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం దృష్ట్యా వారి అభివృద్ధికి పాటు పడుతున్నదని, పేదలు, రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం అని, గ్రామస్తులు కలిసి కట్టుగా గ్రామంలో ఉన్న సౌకర్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి తీసుక రావడానికి పల్లె ప్రగతి కార్యక్రమంలో కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నాలుగు విడతలుగా పల్లె ప్రగతి కార్యక్రమాలను నిర్వహించుకొని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి ఆలోచన మేరకు పూర్తి చేసుకోవడం జరిగిందని, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ దామాలు, సెగ్రి గేషన్ షెడ్, డంపింగ్ యార్డ్, మిషన్ భగీరథ ఓ హెచ్ ఎస్ ఆర్ నిర్మాణాలు పూర్తి చేసుకున్నామని, కానీ ఉపయోగంలోకి తీసుకొని రానందున, వాటిల్లో ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో అవసరమైన సౌకర్యాలు కల్పించి పూర్తిగా ఉపయోగంలోకి తీసుకొని రావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో కార్యక్రమాలు చేపడుతున్నదని, జీవితంలో ఆరోగ్యం, చదువు పైన ఎక్కువ ఖర్చు చేస్తున్నామని, ఆరోగ్యం అనేది మనం తినే భోజనం, పళ్ళ ద్వారా, వైద్యం ద్వారా కాకుండా ప్రకృతి పరంగా ఎటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నం, గాలి పీల్చుతున్నమో గమనించాలని, మంచి వాతావరణం కల్పించుకోవాలి అని, మిషన్ భగీరథ ద్వారా రక్షిత మంచినీరు, పల్లె ప్రకృతి వనాలను సందర్శించి మొక్కలు పెరిగే విధంగా చూడాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు, రోజు వారి చెత్త సేకరణ జరగాలనీ, సెగ్రీ గేషను షెడ్లలో కంపోస్ట్ గా మార్చడం వంటి వాటిని గ్రామస్తులు పరిశీలించి నిరంతరం కార్యక్రమాలు నిర్వహించే విధంగా చూడాలని తెలిపారు.

గ్రామంలో ఉన్న ఇళ్లలో ప్రతి రోజూ 200 ఇళ్లలో చెత్త సేకరణ జరుగుతున్నదని, గ్రామంలో చేపట్టిన కార్యక్రమాల వివరాలతో కూడిన ఫ్లెక్సీ నీ ప్రదర్శించడం జరిగిందని, ఆ వివరాలను పరిశీలించాలని, గ్రామంలో జరుగుతున్న పనులపై అందరూ అవగాహన కలిగి ఉండాలని, సామూహిక ప్రయోజనం కొరకు కావలసిన వాటిపై అడగాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, సర్పంచ్ గంట సంజీవరెడ్డి, జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యులు యాకుబ్ రెడ్డి, వైస్ ఎంపీపీ నవీన్ రెడ్డి, జెడ్పీటీసీ శ్రీనాథ్ రెడ్డి,
ఎంపీటీసీ అశోక్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అరుణ్ జ్యోతి, డి ఆర్ డి ఓ సన్యాసయ్య, డి పి ఓ సాయిబాబా, మిషన్ భగీరథ డీఈ శ్రీనివాస్, టీఎస్ ఎన్పీడీసీఎల్ డి ఈ సునీతా దేవి, తహసిల్దార్ ఫరిరుద్దిన్, ఇంచార్జి ఎంపీడీవో రఘుపతి రెడ్డి, ఏ. ఈ.కళాధర్, ఏ. ఓ. వెంకన్న, అధికారులు గ్రామ పాలక వర్గం ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post