పల్లె ప్రగతి ద్వారా గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ తెలిపారు. భీమదేవరపల్లి మండలం లోని విశ్వనాథ కాలనీలో శుక్రవారం ఐదో విడత పల్లె ప్రతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తో కలిసి ప్రారంభించారు

పల్లె ప్రగతి తో గ్రామాల అభివృద్ధి

– జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్

పల్లె ప్రగతి ద్వారా గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ తెలిపారు. భీమదేవరపల్లి మండలం లోని విశ్వనాథ కాలనీలో శుక్రవారం ఐదో విడత పల్లె ప్రతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెలన్నీ అద్దంలా మెరిసేలా అభివృద్ధిలో తీర్చి దిద్దాలని సూచించారు. గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కీలకపాత్ర పోషించాలని సూచించారు. నేటి నుంచి ఈనెల 18వ తేదీ వరకు నిత్యం ఒకరోజు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పన పై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అనంతరం ముల్కనూరు, ముత్తారం గ్రామాల్లో క్రీడా మైదానాల ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, ఎంపీపీ జక్కుల అనిత, జడ్పిటిసి వంగ రవి, డిఆర్డిఓ శ్రీనివాస్ కుమార్, సి డి పి ఓ అనిత, ఎంపీడీవో భాస్కర్, ఎంపీవో నాగరాజు, సర్పంచులు అనిత, కొమురయ్య, శాంతి కుమార్, ఏపీవో కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.           

Share This Post