పల్లె ప్రగతి ద్వారా పల్లెల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి…:: జిల్లా కలెక్టర్ కె. శశాంక

పల్లె ప్రగతి ద్వారా పల్లెల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి…:: జిల్లా కలెక్టర్ కె. శశాంక

పల్లె ప్రగతి ద్వారా పల్లెల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి…

మాటేడు, తొర్రూరు మండలం,
మహబూబాబాద్ జిల్లా, జూన్ -06:

పల్లె ప్రగతి ద్వారా పల్లెల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు.

పల్లె ప్రగతి కార్యక్రమం సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్ తొర్రూరు మండలం మాటేడు గ్రామంలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని సందర్శించి ఖో ఖో, లాంగ్ జంప్, కబడ్డీ ఆట స్థలంను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులు, గ్రామస్తులతో కలిసి వాలీ బాల్ ఆడి యువకుల్లో గ్రామస్తుల్లో ఉత్సాహాన్ని నింపారు. మైదానం చుట్టూ ఆవరణలో మొక్కలు నాటాలని, మిషన్ భగీరథ ద్వారా నీరు అందే విధంగా చూడాలని, టాయిలెట్ నిర్మాణాలు చేయాలని, యువకులు, గ్రామస్తులు పూర్తి స్థాయిలో క్రీడా మైదానాలను వినియోగించుకొని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా జీవించాలని, టీవీ లకు, సెల్ఫోన్లకు ఆకర్షితులై యువకులు పెడదారి పడుతున్నారని గ్రామీణ క్రీడ మైదానాన్ని ఉపయోగించుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు తెలిపారు.

అనంతరం మాటేడు గ్రామం లో మన ఊరు మన బడి లో ఎంపిక చేసిన జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ను జిల్లా కలెక్టర్ ప్రతిపాదనల ప్రకారం చేయవలసిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా చేయవలసిన పనుల పై సలహాలు, సూచనలు ఇచ్చారు. పనులు పకడ్బందీగా చేయాలని, శిధిలావస్థలో ఉన్న భవనాన్ని కూల్చి టాయిలెట్స్ నిర్మించాలని అధికారులకు తెలిపారు. పాఠశాల ఆవరణ లోని ఆట స్థలం లో మట్టి పోసి లెవెల్ చేసి వర్షాకాలం మీరు ఆగకుండా బయటికి పోయే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

అనంతరం మాటేడు గ్రామంలో చెత్త సేకరణపై సర్పంచ్ ను వివరాలు అడిగారు. 938 గృహాలు ఉండగా, ఒక ట్రై సైకిల్ తో చెత్త సేకరిస్తుందడం తో, కనీసం 4 ట్రై సైకిల్స్ లు ఏర్పాటు చేసుకోవాలని, సెగ్రియేషన్ ద్వారా చెత్త సేకరణ చేసి ఎరువులుగా మార్చుకుని ఆదాయాన్ని సమకూర్చాలని తెలిపారు. మిషన్ భగీరథ నీరును ప్రతి గడపకు అందే విధంగా తగు చర్యలు చేపట్టాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ శోభ, పంచాయతీ కార్యదర్శి వనిత, డి ఆర్ డి ఓ సన్యాసయ,ఆర్డీవో రమేష్, డి ఈ నరేందర్ రెడ్డి , డిప్యూటీ సీఈఓ నర్మద, ఎన్పి.డి.సి.ఎల్. డి.ఈ., మిషన్ భగీరథ డి.ఈ శ్రీనివాస్., అధికారులు, సంభందిత అధికారులు, ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post