పల్లె ప్రగతి పనులను త్వరగా పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ యం. హరిత

మంగళవారం వరంగల్ కలెక్టరేట్ లో ని సమావేశ మందిరంలో పెండింగ్ లో ఉన్న పల్లె ప్రగతి పనులపై MPDO,MPOS,PR DE,PR AE లతో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు.

రివ్యూ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ….డంపింగ్ యార్డులు, వైకుంఠ గ్రామాలు పనులును వేగవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు.

నేషనల్ హైవేస్,ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ రోడ్ల ఇరు పక్కల ఏ వెన్యూ ప్లాంటేషన్,మల్టీ లేయర్ ప్లాంటేషన్ చేపట్టాలని మండలానికి 25 కిలోమీటర్ల తగ్గకుండా మల్టీ లేయర్ ప్లాంటేషన్ గుర్తించి నివేదికలు పంపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

బృహత్ పల్లె పకృతి వనాల కొరకు స్థల సేకరణ పూర్తయిన చోట మొక్కలు నాటాలని స్థల సేకరణ పూర్తి కానీ మండలాలు త్వరగా గుర్తించి మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

దీనిపై జిల్లా కలెక్టర్ మండలాల వారీగా నివేదికలను అడిగి తెలుసుకున్నారు.

పనులు పూర్తయిన చోట పంచాయతీరాజ్ AE లు ఎంబి లను త్వరగా అప్లోడ్ చేయాలన్నారు .

వచ్చే నెల నుండి పాఠశాలలు ప్రారంభం కానున్నందున ప్రభుత్వ పాఠశాలలోని టాయిలెట్స్,పరిసరాలను పరిశుభ్ర పరిచేలా తగు చర్యలు తీసుకునేలా పంచాయతీ సిబ్బందిని ఆదేశించాలన్నారు.

జిల్లాలో జరుగుతున్న పనుల పురోగతిపై జిల్లా పంచాయతీ అధికారి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ తెలిపారు.

మండల పరిధిలో ఉన్న రోడ్ల వివరాలు వాటి యొక్క విస్తీర్ణం పై నివేదిక అందజేయాలని కలెక్టర్ ఎంపీడీఓ లను ఆదేశించారు.

పల్లె ప్రగతి పనులపై ప్రతిరోజు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తానని కలెక్టర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్ బి. హరి సింగ్, డి ఆర్ డి ఓ.సంపత్ రావు, పిఆర్ ఈ ఈ శంకరయ్య, జడ్పీ సీఈవో రాజారావు, డిపిఓ ప్రభాకర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post