పల్లె ప్రగతి పనులను వేగంగా పూర్తి చేయాలన్న జిల్లా కలెక్టర్ బి.గోపి

పల్లె ప్రకృతి వనాలు, హరితహారం, నర్సరీ నిర్వహణ తదితర అంశాల పైన కలెక్టర్ శనివారం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఎంపీడీవో లతో రివ్యూ తీసుకున్నారు .

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ లను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలన్నారు .

కమ్యూనిటీ సోప్ పిట్స్, ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

గ్రామాలలో మొక్కలు పెంచడం, నర్సరీలను అభివృద్ధి పరిచే పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు.

వైకుంఠ దామాలలో కొన్నిచోట్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయని ఆర్చీలు, బర్నింగ్ ప్లాట్ఫామ్లు ఇంకా పూర్తి కాలేదని..వెంటనే అట్టి పనులను వేగవంతం చేయలన్నారు

పూర్తి అయిన చోట వాటికి పేమెంట్ అందేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.

బృహత్ పల్లె పకృతి వనాలలో ఒక క్రమపద్ధతిలో
మొక్కలు నాటాలని, పల్లె ప్రకృతి వనాలలో ప్రజలు సేద తీరేలా, అలాగే వాకింగ్ ట్రాక్ లను కూడా రోజూ వినియోగించు కునే విధంగా మండల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డి ఆర్ డి ఓ సంపత్ రావు, డిపిఓ ప్రభాకర్, పంచాయతీరాజ్ ఈ ఈ శంకరయ్య, ఎంపీడీవోలు ఎంపిఓలు పాల్గొన్నారు.

Share This Post