పల్లె ప్రగతి పనుల్లో ఎలాంటి అలసత్వం వహించవద్దని, పల్లెలను పరిశుభ్రంగా ఉంచాలని, ఇది నిరంతర కార్యక్రమమని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి అన్నారు.

సోమవారం నాడు యాదగిరిగుట్ట మండలం మైలార్ గూడెం,  సైదాపూర్,  మాసాయిపేట, గౌరాయిపల్లి గ్రామాలలో పల్లె ప్రగతి పనులను ఆమె  పరిశీలించారు.
మైలార్ గూడెం గ్రామంలో ఉపాధి హామీ పనుల వివరాలను, రికార్డులను పరిశీలించారు. నర్సరీ పనులను పరిశీలించారు మొలకెత్తని వాటి స్థానంలో కొత్తవి మళ్లీ నాటాలని క్రమం తప్పకుండా చేపట్టాలని సూచించారు. గౌరాయిపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి మొక్కల పెరుగుదలను పరిశీలించారు. సైదాపురం గ్రామం నర్సరీని పరిశీలించారు. మాసాయిపేట ప్రాథమిక ఆరోగ్య సబ్ సెంటర్ ను సందర్శించి వ్యాక్సినేషన్ వివరాలను పరిశీలించారు. అనంతరం రైతు వేదిక భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,  పల్లె ప్రగతి  కార్యక్రమాలు నిరంతరం జరుగాలని,  గ్రామాలు  పరిశుభ్రతతో ఉండాలిని,  ఎలాంటి అపరిశుభ్రతకు తావివ్వవద్దని, అధికారులు, సర్పంచులు క్షేత్రస్థాయిలో పనులు నిర్విరామంగా పరిశీలించాలని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాలలో గ్రామ సర్పంచులు, సిబ్బంది బాగా పని చేస్తున్నారని, సీజనల్ వ్యాధులు తగ్గాయని ఇది అందరి కృషి ఫలితమని,  పల్లె ప్రగతి కార్యక్రమాల గొప్పతనమని  అన్నారు.
కార్యక్రమాలలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉపేందర్ రెడ్డి, ఎంపీడీవో ప్రభాకర్ రెడ్డి, ఎంపీఓ చంద్రశేఖర్, గ్రామపంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
పల్లె ప్రగతి పనుల్లో ఎలాంటి అలసత్వం వహించవద్దని, పల్లెలను పరిశుభ్రంగా ఉంచాలని, ఇది నిరంతర కార్యక్రమమని::: జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి

Share This Post