పల్లె ప్రగతి ,బడిబాట, టెట్ పరీక్ష నిర్వహణ పై అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్

పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రత్యేక అధికారులు కట్టుదిట్టంగా నిర్వహించాలి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

టెట్ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

జూన్ 3 నుంచి బడిబాట కార్యక్రమం నిర్వహణ

పెద్దపల్లి జూన్ 01:- పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రత్యేక అధికారులు కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. పల్లె ప్రగతి, టెట్ పరీక్షల నిర్వహణ, బడిబాట కార్యక్రమాలపై కలెక్టర్ బుధవారం మండల ప్రత్యేక అధికారులతో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రివ్యూ నిర్వహించారు.

జూన్ 3 నుంచి జూన్ 18 వరకు 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికి సంబంధించి రోజువారి నిర్వహించాల్సిన కార్యక్రమాల వివరాలను గ్రామాలకు అందజేశామని, సదరు కార్యక్రమాలు సజావుగా జరిగే విధంగా ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.

పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహణ పై ఎంపీడీవో, ఎం పి ఓ, ప్రజా ప్రతినిధులతో కలిసి మండల స్థాయిలో సమన్వయ సమావేశాలు నిర్వహించి, చేపట్టాల్సిన పనులు వివరించాలని కలెక్టర్ ప్రత్యేక అధికారులకు సూచించారు గ్రామాలలో పల్లె ప్రగతి పనులకు సంబంధించి ట్రెజరీ లో సమర్పించిన బిల్లులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో చెల్లించిందని, పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ బిల్లులు సైతం త్వరలో విడుదల అవుతాయని కలెక్టర్ అన్నారు.

పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహణ సమయంలో గ్రామాలకు కేటాయించిన ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు ఉదయం 7 గంటలకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ అన్నారు.

5వ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పవర్ డే , మిషన్ భగీరథ ట్యాంకులు శుభ్రం చేసుకోవాలని, అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలన, శ్రమదానం, డంపింగ్ యార్డ్, వైకుంఠ గ్రామాలు సందర్శన వంటి పనులకు గ్రామాల్లోని పరిస్థితుల ఆధారంగా షెడ్యూల్ రూపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు.

జూన్ 2 నాటికి ప్రతి మండలంలో కనీసం 2 గ్రామాలలో ప్రతి మున్సిపాలిటీకి 2 క్రీడా ప్రాంగణాల ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు గ్రామాలలో మురికి నీరు నిల్వ ఉండకుండా అవసరమైన ప్రదేశాల్లో కమ్యూనిటీ ఇంకుడు గుంతలు నిర్మాణ పనులు ప్రారంభించాలని, ప్రభుత్వ సంస్థల పరిసరాలను ప్రత్యేక శ్రద్ధ వహించి శుభ్రం చేయాలని అన్నారు.

గ్రామ పంచాయతీలలో అవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనం కింద నాటిన మొక్కలను పరిశీలించాలని, 8వ విడత హరితహారం లో మొక్కలు నాటే స్థలాలను గుర్తించాలని కలెక్టర్ సూచించారు. గ్రామాలలో శ్రమదానం కార్యక్రమం నిర్వహించి ఇళ్ల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని, తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా సేకరించి అంశంపై అవగాహన కల్పించాలని అన్నారు.

జూన్ 30 నాటికి ప్రతి మండలంలో 2 పాఠశాలలో మన ఊరు మన బడి అభివృద్ధి పనులు పూర్తి చేసి సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు ప్రతిరోజు పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల పై ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని, మండలాల వారీగా రవాణా యూనిట్లు మినహాయించి మిగిలిన దళిత బంధు యూనిట్ల గ్రౌండింగ్ 2 త్వరలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కుందన పల్లి లోని అర్బన్ ఫారెస్ట్ అభివృద్ధి పనులు ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించాలని కలెక్టర్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు.

జిల్లా ప్రారంభం నుంచి రామగుండం వరకు జాతీయ రహదారి, మంథని, ధర్మారం రహదారుల పై సైతం ఒకే విధంగా మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్ చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు దీని కోసం జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి అటవీ అధికారి మున్సిపల్ కమిషనర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

జూన్ 12న నిర్వహిస్తున్న టెట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, జిల్లా లో ఏర్పాటు చేస్తున్న 21 పరీక్ష కేంద్రాలకు ప్రశ్నపత్రాలు తరలించే సమయంలో అవసరమైన బందోబస్తు కల్పించాలని పోలీసు అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ప్రతి పరీక్ష కేంద్రం వద్ద వైద్య శాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలని, పరీక్ష సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, పరీక్ష కేంద్రాల వద్దకు అవసరమైన మేర బస్సులను నడపాలని కలెక్టర్ సూచించారు.

జూన్ 3 నుంచి నిర్వహించే బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా సంక్షేమ అధికారి, బీసీ ఎస్సీ, మైనారిటీ అధికారులు కృషిచేయాలని కలెక్టర్ సూచించారు. కరోనా కారణంగా గత 2 సంవత్సరాలుగా కొంతమేర విద్యార్థులు పాఠశాలలకు దూరంగా ఉన్నారని, విద్యార్థుల డ్రాప్ ఓట్లు జరగకుండా డా అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం తో పాటు ఇంగ్లీష్ మీడియం విద్య ప్రారంభిస్తున్నామనే అంశాన్ని బడిబాట కార్యక్రమంలో విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్ సూచించారు ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ సైతం అందించామని, ప్రైవేటుకు ధీటుగా నాణ్యమైన విద్యాబోధన విద్యార్థులకు అందించేందుకు అన్ని రకాలుగా పాఠశాలలను సిద్ధం చేస్తున్నామని సందేశం ప్రజలలో వేగంగా వెళ్లాలని కలెక్టర్ తెలిపారు.

అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, పెద్దపల్లి ఏసిపి సారంగపాణి, మండల ప్రత్యేక అధికారులు, సంబంధిత అధికారులు,తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post