పల్లె ప్రగతి మార్గదర్శకాలకనుగుణంగా విధులు నిర్వహించని నలుగురు సర్పంచులు, ఐదుగురు పంచాయతి కార్యదర్శులకు షోకాజ్ నోటిసులు జారీ.

పల్లె ప్రగతి మార్గదర్శకాలకనుగుణంగా విధులు నిర్వహించని నలుగురు సర్పంచులు, ఐదుగురు పంచాయతి కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ సోమవాం నాడు షోకాజ్ నోటిసులు జారీచేసారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్, డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్ లు నేడు ఆకస్మిక తనఖీ చేయగా వారు పల్లె ప్రగతికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన సూచనలు, విధి, విధానాలు పాటించక విధుల పట్ల అలసత్వం ప్రదర్శించినందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదో సంజాయిషీ ఇవ్వవలసినదిగా ఆదేశిస్తూ షోకాజ్ నోటిసులు జారీ చేసారు. శంకరంపేట మండలం ఆరేపల్లి, శంకరంపేట సర్పంచులు, కార్యదర్శులకు, అల్లాదుర్గ్ మండలం గడిపెద్దాపూర్, టేక్మల్ మండలం పాల్వంచ సర్పంచులకు, కార్యదర్శులకు నోటిసులు జారీ చేసారు. కాగా కుల్చారం మండలం రంగంపేట్ పంచాయతి కార్యదర్శికి కూడా పల్లె ప్రగతి విధివిధానాలు పాటించ నందున షోకాజ్ నోటిసులు జారీ చేసారు.

Share This Post