పల్లె ప్రగతి, హరితహారం, అవెన్యూ ప్లాంటేషన్, సీజనల్ వ్యాధులు, గ్రామీణా ఉపాధి హామీ పధకం గుడ్ గవర్నెన్స్ పై ఏం.పి.డి.ఓ. లు ప్రత్యేక దృష్టి పెట్టవలసినదిగా జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ ఆదేశించారు

పల్లె ప్రగతి, హరితహారం, అవెన్యూ ప్లాంటేషన్, సీజనల్ వ్యాధులు, గ్రామీణా ఉపాధి హామీ పధకం గుడ్ గవర్నెన్స్ పై ఏం.పి.డి.ఓ. లు ప్రత్యేక దృష్టి పెట్టవలసినదిగా జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ ఆదేశించారు

పల్లె ప్రగతి, హరితహారం, అవెన్యూ ప్లాంటేషన్, సీజనల్ వ్యాధులు, గ్రామీణా ఉపాధి హామీ పధకం గుడ్ గవర్నెన్స్ పై ఏం.పి.డి.ఓ. లు ప్రత్యేక దృష్టి పెట్టవలసినదిగా జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుండి ఏం.పి.డి.ఓ.లు, ఏం.పి .ఓ.లు, తహసీల్ధార్లు, పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ మండలాలలో కన్వెర్జెన్సీ సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆ మండలంలో చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించి పనుల పురోగతి త్వరితగతిన జరిగేలా చూడాలన్నారు. మండలాలలో గత మూడు సంవత్సరాల నుండి ఎన్ని మొక్కలు నాటారు, ఎన్ని బ్రతికినవి, పాడయినవి ఎన్ని, ఆ స్థానంలో మొక్కలు నాటుటకు ప్రస్తుతం నర్సరీలలో ఎన్ని మొక్కలు లభ్యంగా ఉన్నాయి, మరెన్ని మొక్కలు కావాలో క్షేత్ర స్థాయిలో ఏం.పి .డి.ఓ.లు క్షుణ్ణంగా పరిశీలించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చురుకుగా చేపట్టాలన్నారు. అదేవిధంగా రహాదారుల వెంట ఎన్ని కిలో మీటర్ల మేర ముల్టీపుల్ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలి, ఎన్ని మొక్కలు అవసరమవుతాయి, ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ప్రణాళికాబద్ధంగా సాగాలని సూచించారు. ఉన్నతాధికారులు వచ్చి పరిశీలిస్తారని గాక భాద్యతగా, స్వయం సంతృప్తి నిచ్చే విధంగా మొక్కలు నాటించాలని, నాటిన ప్రతి మొక్క బ్రతికేలా చూడాలని, వచ్చే వారం నాటికి పురోగతి కనిపించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి మండలంలో చేపట్టిన బృహత్ పల్లె ప్రకృతి వనాలలో గుంతలు తీసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. పల్లెప్రగతి క్రింద చేపట్టిన వైకుంఠధామాలు, సేగ్రిగేషన్ షెడ్ ల నిర్మాణం వంటి పనులకు పనుల పురోగతిని బట్టి వెంటవెంటనే డబ్బులు చెల్లించాలని, అప్పుడే కాంట్రాక్టర్లలో ఉత్సాహం వస్తుందని, పనులు కూడా మరింత వేగవంతమవుతాయని, లేకుంటే తప్పుడు సందేశం వెళ్లే అవకాశముందని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఇటీవల చేపట్టిన వైకుంఠధామాలు మినహా మిగతా పనులు శరవేగంతో పూర్తిచేయాలన్నారు. జిల్లాలో 31 వైద్య ఉప కేంద్రాలు మంజూరు కాగా 11 కేంద్రాల నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగతా నిర్మాణాలకు వెంటనే గ్రామ సభలో తీర్మానాలు చేసి పనులు చేపట్టవలసినదిగా పంచాయత్ రాజ్ ఈ.ఈ. కి సూచించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు తొలగించాలన్నారు.
మన జిల్లాలో పంచాయతీ రాజ్ , వైద్యాధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంవల్ల సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడగలిగామని అందుకు వారిని అభినందిస్తూ అయినా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అల్లాదుర్గ్, రేగోడ్, చిల్పిచెడ్ రామాయంపేట వంటి ప్రాంతాలలో దోమకాటువల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా గ్రామంలో ఒక్క కేసు కనిపించినా వెంటనే వైద్య బృందాన్ని పంపిస్తామని అన్నారు. ముఖ్యంగా పరిసర ప్రాంతాలలో నీరు నిలువ ఉండకుండా, దోమలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్త వహించాలని, ఏం.పి డి.ఓ. లు ప్రతిరోజూ రోజు కనీసం 3, 4 గ్రామాలు పర్యటించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలన్నారు. రజక., నాయీబ్రాహ్మణులు ఏర్పాటుచేసుకున్న లాండ్రీ షాపులు, క్షౌరశాల, ధోబీఘాట్లకు ప్రభుత్వం 250 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తున్నదని, ఈ అవకాశాన్ని జిల్లాలోని రజక., నాయీబ్రాహ్మణులు సంపూర్ణంగా వినియోగించుకునేలా వారిలో అవగాహన కలిగించాలని అన్నారు.. మీ సేవ కేంద్రాలలో పేర్లు నమోదు చేసుకోవచ్చని, లేదా జిల్లా బి.సి. సంక్షేమాధికారికి వివరాలు అందజేసిన వారు ఆన్ లైన్ లో నమోదు చేస్తారని తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ధరణి రిజిస్ట్రేషన్ కు సంబంధించి తహసీల్ధార్లు ఉదయం 10. 20 గంటల లోగా లాగిన్ కావాలని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, జెడ్పి సి.ఈ.ఓ. శైలేష్, డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, డి.పి .ఓ. తరుణ్ కుమార్, పంచాయత్ రాజ్ ఈ..ఈ. రామచంద్ర రెడ్డి, డి.ఈ.లు, తహసీల్ధార్లు, ఏం.పి .డి.ఓ.లు, ఏం.పి .ఓ.లు తదితరులు పాల్గొన్నారు

Share This Post