పల్లే,పట్టణ ప్రగతి పనులు వెంటనే పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

పల్లే,పట్టణ ప్రగతి పనులు వెంటనే పూర్తి చేయాలి*  *జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

*ప్రెస్ రిలీజ్*

*హనుమకొండ,మే 24

*పల్లే,పట్టణ ప్రగతి పనులు వెంటనే పూర్తి చేయాలి*

*జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు*

మంగళ వారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయ మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లాలో కొనసాగుతున్న పల్లే పట్టణ ప్రగతి పనులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే జూన్ నెలలో తెలంగాణకు హరిత హారం, పల్లే ప్రగతి,పట్టణ ప్రగతి కార్యక్రమాల ను సమర్ధ వంతంగా చేపట్టాలని అన్నారు.పెండిగ్ లో ఉన్న పనులు గ్రామీణ క్రీడా ప్రాంగణాలు, ప్లాంటేషన్, గేట్ ఆర్చి, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, డేన్స్ ప్లాంటేషన్, వైకుంఠ ధామలు, తదితర పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు.

గ్రామాల్లో వంద శాతం ఇంటి పన్ను, నల్ల, విద్యుత్, బిల్లులు వసూలు చెయ్యాలని మిషన్ భగీరథ కలెక్షన్ అందరూ తీసుకొనేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమ పరిధిలో ఉన్న వెంచర్స్, కు అనుమతి ఇవ్వాలని అన్నారు.

మండలానికి కనీసం ఒక్క బృహత్ పల్లే ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని, పల్లే ప్రకృతి వనాలలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలని చెప్పారు.

జిల్లాలో నేషనల్ హై వే వెంబడి మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ లక్ష్యం పూర్తి చేసి మొక్కలను సంరక్షించాలన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్య రాణీ, ఆర్డిఓ వాసు చంద్ర, డిఆర్డిఓ, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎ. శ్రీనివాస్ కుమార్,డిపిఓ వి.జగదీశ్వర్, జిల్లాలోని ఎంపిడిఓ లు, ఎంపిఓ లు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.       

Share This Post