పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని అందరి సమన్వయంతో విజయవంతం చేయాలి : జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

జిల్లాలో ఈ నెల 23 నుండి 25వ తేదీ వరకు నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలని, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ను పోలియో రహిత జిల్లాగా తయారు చేసేందుకు అందరు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవనంలో నిర్వహించిన జిల్లా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశంలో పల్స్‌పోలియో ఇమ్యునైజేషన్‌-2022 కార్యక్రమంపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పల్స్‌పోలియో కార్యక్రమంపై దినపత్రికలు, టి.వి.లు, సినిమా సైడ్స్‌, కేబుల్‌ టి.వి. స్రోలింగ్‌ ఇతరత్రా ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలలో వినత ప్రచారం నిర్వహించాలని, జిల్లాలో దాదాపు 55 వేల మంది 0-5 సం॥ల వయస్సు గల పిల్లలు ఉన్నారని, వీరికి పోలియో చుక్కలు అందించేందుకు 672 పోలియో బూత్స్‌, కూడళ్ళు, రవాణా ప్రాంతాలైన 36 స్థానాలలో తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. పల్స్‌పోలియో వ్యాక్సిన్‌ను జిల్లాలో తగిన ప్రాంతంలో భద్రపర్చడం జరిగిందని, పోలియో వ్యాక్సిన్‌ అందించేందుకు బృందాలను ఏర్పాటు చేసి 0-5 సం॥ల వయస్సు గల పిల్లలందరికీ అందించడంతో పాలు వీధి బాలలను గుర్తించి వ్యాక్సిన్‌ ఇవ్వాలని తెలిపారు. గ్రామాలలో ప్రజలందరికీ తెలిసేలా టామ్‌-టామ్‌ చేయించాలని, ప్రధాన కూడళ్ళు, ప్రజల రద్దీ ఎక్కువగా ఉందే ప్రాంతాలలో వద్ద పోలియో వ్యాక్సిన్‌ తేదీలు తెలిసే విధంగా బ్యానర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా సంబంధిత శాఖల అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post