పత్రిక ప్రకటన
తేదీ : 02–05–2022
పవిత్ర రంజాన్ పండగను ముస్లిం సోదరులు ఆనందంగా జరుపుకోవాలి
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్
పవిత్ర రంజాన్ మాసం ఈద్ ఉల్ ఫితర్గా ముగిసిన శుభవేళ ముస్లిం సోదరులకు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు.
మంగళవారం రోజున రంజాన్ పండగ నేపథ్యంలో జిల్లాలోని ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ ముస్లిం సోదరుల పవిత్రమైన రంజాన్ పర్వదినాన్ని ఆనందోత్సాహాల మధ్య పండగను చేసుకోవాలని కలెక్టర్ కోరారు. రంజాన్ మాస పవిత్రతతో ప్రతి వ్యక్తి మానసిక పరివర్తన చెంది ప్రేమమూర్తిగా మార్పు చెందుతారని ఈ మాసంలో ఆధ్యాత్మిక, ఆరాధనతో అనుబంధం మరింత బలపడుతుందని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. సర్వ మానవాళి సమానత్వాన్ని చాటుతూ, దాతృత్వాన్ని అలవరచే రంజాన్ పండుగ వేళ ఇస్లాంను గౌరవించే ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆనందం వెల్లి విరియాలని కలెక్టర్ హరీశ్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంగళవారం రంజాన్ పండగను ఆనందోత్సాహాల మధ్య మతసామరస్యం వెల్లివిరిసేలా జరుపుకోవాలని పేర్కొన్నారు