పశువైద్యం బలోపేతానికి ఎదురయ్యో అవరోధాలను అధిగమించి పూర్వ స్థితికి తీసుకు రావడం, పశు సంపదను పెంపొందించుటకు పశువైద్యులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని పశువులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.

ప్రచురణార్ధం

ఏప్రిల్ 30 ఖమ్మం:

పశువైద్యం బలోపేతానికి ఎదురయ్యో అవరోధాలను అధిగమించి పూర్వ స్థితికి తీసుకు రావడం, పశు సంపదను పెంపొందించుటకు పశువైద్యులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని పశువులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సంక్షేమ కార్యక్రమంలో పాడి పశువుల పెంపకాన్ని ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టరూచించారు. ఇప్పటికే జిల్లాలో అవసరం మేరకు పాల ఉత్పత్తి లేనందున పటిష్టమైన చర్యలు చేపట్టి జిల్లాను పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేలా చూడాలన్నారు. ఇకపై నిర్వహించుకునే ఇటువంటి కార్యక్రమంలో రైతులను కూడా భాగస్వాములు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఏప్రిల్ 30 శనివారం ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి నిర్విరామంగా మూగజీవాలకు వైద్య సేవలు అందిస్తున్న పశువైద్యులను కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా పశు వైద్యులకు వారి ఆరోగ్య సంరక్షణకు గాను జిల్లాలోని ప్రముఖ వైద్యులచే వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరంలో సిబ్బంది అధికారులు రక్తదానం చేసారు.

పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వేణుమనోహర్, అసిస్టెంట్ డైరెక్టర్ డా॥ బాను, దా॥వి. ఆరుణ, డా||వి.రాజు, డా||ఆర్ శ్రీరమణీ, డా॥కె. ప్రదీప్ కుమార్, డా॥కె. కిషోర్, అధికారులు సిబ్బంది తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post