పాటశాలలు ప్రారంబ మైన నేపధ్యంలో ఎలాంటి అపోహలకు గురి కాకుండా ప్రతి ఒక్కరు తప్పని సరిగా వ్యాక్సినేషన్‌ వేసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.

పత్రికా ప్రకటన                                                                తేది: 03-09 – 20 21

   పాటశాలలు ప్రారంబ మైన నేపధ్యంలో                                                       

ఎలాంటి అపోహలకు గురి కాకుండా ప్రతి ఒక్కరు తప్పని సరిగా వ్యాక్సినేషన్‌ వేసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి  అధికారులకు ఆదేశించారు.

శుక్రవారం మండల ఎం ఇ ఓ లు, ఎం పి డి ఓ లు, హెడ్ మాస్టర్లు,  మెడికల్ అధికారులతో  ఏర్పాటు చేసిన  జూమ్  మీటింగ్ లో మాట్లాడుతూ  పిల్లల హాజరు శాతం పెరిగేలా ఎచ్ ఎం లు, టీచర్లు  బాద్యత తీసుకోవాలని,  పిల్లల తల్లి తండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు. మండల స్తా యి  సమావేశాలు నిర్వహించాలీ. కోవిడ్ రాకుండా పిల్లలు మాస్క్ దరించేలా, బౌతిక దూరం పాటించేలా చూసే బాద్యత టీచర్ లదే నని అన్నారు.  వర్ష కాలం దేని వల్లనైన జ్వరం రావొచ్చు  మెడికల్ స్టాఫ్ వెంటనే టెస్ట్ చేసి యాక్షన్ తీసుకోవాలి.  ప్రవేటు మరియు ప్రభుత్వ టీచర్ లు అందరు వ్యాక్సిన్ తెసుకోవాలన్నారు.  పాటశాల లో అన్ని సౌకర్యాలు కల్పించి  మీ పిల్లలను బడికి పంపించండి అని పంచాయతి సెక్రటరి లు, సర్పంచ్ లు  టాం టాం వెయిo చాలని  అందరికి అవగాహన కల్పించాలని తెలిపారు. మండలం వారిగా  ఎం ఇ ఓ లు, ఎం పి డి ఓ లు, హెడ్ మాస్టర్లు,  మెడికల్ అధికారులతో హాజరు శాతం, టీచర్ల వ్యాక్సినేషన్‌ పై వివరాలు అడిగి తెలుసు కున్నారు.

 సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీహర్ష,  జిల్లా వైద్య అధికారి చందు నాయక్,  సంబదిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

——————————————————————————–

 జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల  గారి చేజారి చేయబడినది.

Share This Post