పాటశాలల పునఃప్రారంబానికి అన్ని సంక్షేమ పాటశాలలు, మరియు గురుకుల పాటశాలలు, వసతి గృహాలు ఈ నెల చివరి వరకు సిద్ధంగ ఉంచాలని జిల్లా కలెక్టర్ శృతి ఓజా అన్నారు.

పత్రికా ప్రకటన                                                                   తేది: 25-8-2021

    పాటశాలల పునఃప్రారంబానికి    అన్ని సంక్షేమ పాటశాలలు, మరియు  గురుకుల పాటశాలలు,  వసతి గృహాలు ఈ నెల చివరి వరకు సిద్ధంగ  ఉంచాలని  జిల్లా కలెక్టర్ శృతి ఓజా అన్నారు.

బుదవారం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లాలోని,ఎస్సి, ఎస్టి, బి సి, గిరిజన, మైనార్టీ  అన్ని గురుకుల పాటశాలల సంక్షేమ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ దాదాపు 16 నెలల నుండి పాటశాలలు మూతపడి  ఉన్నందున ఎక్కడివక్కడ దుమ్ము పట్టి ఉంటాయని ,  అన్ని పాటశాలల తరగతి గదులు, పరిసరాలు, వంట గదులు, టైయిలెట్స్   అన్నింటిని  వర్కర్స్ ను పెట్టి పరిసుబ్రం చేయించాలని  సూచించారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించాలని, నీరు నిల్వ ఉండకుండా మట్టి వేయించాలని అన్నారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థుల  తల్లిదండ్రుల కమిటీలు ఏర్పాటు చేసి పరిశుభ్రమైన పరిసరాలలో పాఠశాలల్లో విద్యా భోదన చేయుటకు చర్యలు తీసుకొవాలని సూచించారు మంచి నీటి ట్యాంకు లను పరిశుబ్రం చేయించాలని అన్నారు.      పాత ఫర్నిచర్ , బుక్స్ పాటశాల తరగతి గదులలో ఉండ రాదని, వసతి గృహాలలో ఉన్నపాత  రైస్  క్వాలిటీ చెక్ చేయించాలని, అధికారులు విసిట్ చేసి చెక్ చేయాలనీ, పాటశాలలు  ప్రారంభించే సమయానికి సిద్ధం చేసి  ఉంచాలని అధికారులకు ఆదేశించారు.    

          ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రఘురాం శర్మ ,  జిల్లా విద్యా శాఖాదికారి సిరాజుద్దీన్, డి ఎస్ డి ఓ శ్వేత, డి ఎస్ ఓ రేవతి, , బిసి  సంక్షేమ అధికారి కేశవులు,మైనార్టీ అధికారి ప్రసాదరావు, తదితరులు  పాల్గొన్నారు.

  ————————————————————————

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్   ద్వారా జారిచేయబడినది.

Share This Post