పాఠశాలలకు అత్యధిక మంది పిల్లలు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి… రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

ప్రచురణార్థం

పాఠశాలలకు అత్యధిక మంది పిల్లలు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి…

మహబూబాబాద్ ఆగస్టు 28.

విద్యాసంస్థలు పునః ప్రారంభిస్తు నందున విద్యార్థులు పాఠశాలకు అత్యధిక సంఖ్యలో హాజరయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు.

శనివారం కలెక్టర్ కార్యాలయంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి విద్యా సంస్థల పునఃప్రారంభం పై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధ్యక్షతన మంత్రి అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాఠశాలల పునః ప్రారంభం వేడుకలను అట్టహాసంగా చేపట్టాలన్నారు పాఠశాలలో మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు 1209 పాఠశాలలు ఉండగా అందులో 126 ప్రైవేట్ పాఠశాలలు ఉండటం ఎక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కంటే తక్కువగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం సరికాదన్నారు.
అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలల లోనే ఏర్పాటు చేయడం ఫలితాలు రాబట్టవచ్చు అన్నారు అదేవిధంగా అంగన్వాడి పరిధినుండి ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టేందుకు పరిశీలిస్తామన్నారు కోవిద్ 6 శాతంగా ఉందని యాక్టివ్ కేసులు 173 ఉన్నాయన్నారు సీజనల్ డిసీజెస్ లో భాగంగా జిల్లాలో 19 మలేరియా కేసులు ఉండగా అత్యధికం గంగారం లో 9 నమోదైన వన్నారు. డెంగ్యూ కేసులు 17 నమోదవగా 6 డెంగ్యూ కేసులు కురవి లో నమోదయ్యాయని అన్నారు. వైద్య శాఖ అధికారులు గ్రామాలలో పర్యటించాలని సీజనల్ వ్యాధులు సోకకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సెప్టెంబరు 1వ తేదీ నుండి పాఠశాలలకు విద్యార్థులు రానునందున అధికారులు మౌలిక వసతుల కల్పన త్వరితగతిన చర్యలు చేపట్టాలన్నారు.

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి పాఠశాలలో పునఃప్రారంభం కానున్నందున అధికారులు అప్రమత్తం చేశామని పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
శానిటేషన్ పై ప్రధాన దృష్టి సారించామన్నారు. పాఠశాలలో చేతులు కడిగే విధానంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు అదే విధంగా కోవిద్ నిబంధనలు పాటిస్తూ విద్యాబోధనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఐదు వేలకు పైగా ఉపాధ్యాయులు ఉన్నారని ప్రతి పాఠశాలను క్షేత్రస్థాయిలో అధికారులను పర్యటింప చేసి అన్ని వసతులతో విద్యనందించేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు అదేవిధంగా పాఠశాల ఆవరణ పరిశుభ్ర పరుస్తూ మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు పిచ్చి మొక్కలు చెత్తాచెదారం తొలగింప చేస్తున్నామన్నారు.

మహబూబాద్ శాసనసభ్యులు శంకర్ నాయక్ మాట్లాడుతూ పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నీటి నిల్వ ఉన్న ప్రాంతాల పై చర్యలు తీసుకోవాలన్నారు ప్రభుత్వ భవనాలు వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.

జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో శానిటేషన్ అత్యంత అవసరమని బాలికల పాఠశాలలో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు త్రాగునీటి సరఫరా లో క్లోరినేషన్ జరగాలని ట్యాంకులను పరిశుభ్ర పరచాలని అన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో జడ్పీ చైర్మన్ కుమారి బిందు అదనపు కలెక్టర్ కొమరయ్య మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు
——————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post