పాఠశాలలకు ప్రహరీ గోడ లేకుంటే బయో ఫెనిషింగ్ చేయాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన
రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం మద్దూర్ మండలం నిడ్జింత, కొత్తపల్లి, మద్దూర్ లో పర్యటించి పల్లే ప్రగతి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ వివరిస్తూ పల్లె ప్రగతిలో కెవలం పారిశుధ్య కార్యక్రమాలే కాకుండా 15 రోజులు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. పల్లె ప్రగతిలో భాగంగా విద్య సంస్థలకు బయో ఫెనిషింగ్ ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. నిద్జింత లో పర్యటించిన కలెక్టర్ గ్రామం లో ఏర్పాటు చేసిన నర్సరిని పరిశీలించి హరితాహారం కు సరిపడ మొక్కలను సిద్దంగా ఉంచుకోవలన్నారు. గ్రామా పంచాయతి లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాటశాలలో క్రీడ ప్రాంగణాన్ని పరిశిలించి కొత్తపల్లి లో పారిశుధ్య కార్మికులు నిర్వహిస్తున్న పనులను పరిశీలించారు. పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి ఆగ్రహం వ్యక్త పరిచారు. ప్రకృతివనంలో రోజు నీటిని పట్టించాలని డంపింగ్ యార్డ్ కు వచ్చే చెత్తను తడి పొడి చెత్తగా వేరు చేయాలనీ సూచించారు. డంపింగ్ యార్డ్‌ను వినియోగంలోకి తిసుకు రావాలని ఆదేశించారు. గ్రామ పంచాయతిలో సేకరించిన చెత్తను సెగ్రిగేషన్ షెడ్ కు తరలించి కార్మికుల ద్వార సేంద్రియ ఎరువులను తయారు చేయించాలన్నారు. అనంతరం మద్దూర్ మండల కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్ట్ ను పరిశీలించి కళాశాలకు బయో ఫెంషిన్ ఏర్పరచుకోవాలని సూచించారు. గ్రామా పంచాయతి లలో గ్రామస్తులతో మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుబ్రంగా ఉంచుకోవాల్సిన భాద్యత గ్రామస్తులపైనే ఉందని, తమ పరిసరాలను శుబ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామా పంచాయతి కార్మికులకు సహకరించి ఇండ్ల నుంచి ఇచ్చే చెత్త ను తడి పొడి చెత్తగా వేరు చేసి ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో డిపిఓ మురళి, యంపిడిఓ విజయ్ లక్ష్మి మరియు RI శ్రీనివాస్ గౌడ్ , పంచాయత్ సెక్రటరి తదితరులు పాల్గొన్నారు.