పాఠశాలలకు విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

పాఠశాలలకు విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

నాగర్ కర్నూల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ శనివారం మధ్యాహ్నం అకస్మికంగా సందర్శించారు.
ప్రధానోపాధ్యాయుడు కురుమయ్య తో పాఠశాల విద్యార్థుల హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పాఠశాలలో 1,013 మంది విద్యార్థులకు గాను 139 మంది విద్యార్థులే మాత్రమే హాజరవడానికి గల కారణాలను కలెక్టర్ అడగగా సంక్షేమ వసతి గృహాల నుండి ఎక్కువ శాతం విద్యార్థులు ఉన్నారని, వసతి గృహాలు తెరుచుకోని కారణంగా హాజరు శాతం తగ్గిందని కలెక్టర్కు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వివరించారు.
10వ తరగతి గదిని సందర్శించిన కలెక్టర్ పాఠశాలకు మీ మీ స్నేహితులు ఇంకా ఎందుకు హాజరు కావడం లేదని కలెక్టర్ అడుగగా సోమవారం నుండి విద్యార్థులు పాఠశాలకు హాజరవుతారని బదులిచ్చారు.
10వ తరగతి ఆంగ్ల మాధ్యమ విద్యార్థులను సాంఘిక శాస్త్రం లో ఖండ చలన సిద్ధాంతం అనగానేమి అని అడుగగా విద్యార్థులు సమాధానం ఇవ్వలేదు.
ఆన్లైన్ తరగతుల్లో ఏ చాప్టర్ వరకు క్లాసులు జరిగాయని విద్యార్థులను ఆంగ్లంలోనే అడిగి తెలుసుకున్నారు.
మళ్లీ పాఠశాలను సందర్శిస్తారని అప్పుడు సమాధానాలు అడుగుతాననన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్ 19 నిబంధనలు పాటించాలన్నారు.
ప్రతీ తరగతి గదిలో శానిటేషన్ చేయాలని ఆదేశించారు.
మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులను తరగతుల వారీగా పంపాలనన్నారు.
ఉపాధ్యాయులకు పలు సూచనలు సలహాలు చేశారు.
పాఠశాల కు వచ్చే విద్యార్థులు మాస్క్, శానిటైజర్, తాగు నీరు వేంట తేచ్చుకునే విధంగా చూడాలని పేర్కొన్నారు.
విద్యార్థుల హాజరు శాతం పెంచే విధంగా చూడాలన్నారు.
కలెక్టర్ వెంట డీఈవో గోవిందరాజులు, స్ట్రాంగ్ టీచర్ వెంకటేశ్వర్ల శెట్టి పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post