పాఠశాలలు, కళాశాలల్లో పారిశుద్ధ్యం, కోవిడ్ వ్యాక్సిన్ అంశాలపై సమీక్ష : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
3 9 2021
వనపర్తి

జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో పారిశుద్ధ్యం ,కోవిడ్ వ్యాక్సిన్ తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

వనపర్తి జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమైన నేపధ్యంలో వాటి పనితీరు, సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై జిల్లా కలెక్టర్ వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్, డీఎంహెచ్‌వోలు, డీపీవోలు పాల్గొన్నారు. పాఠశాలలకు హాజరైన విద్యార్ధుల శాతం, టీచర్లకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం పై ఆరా తీశారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లోని టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాప్‌కు కూడా వందశాతం వ్యాక్సినేషన్‌ వేయించాలని ఉన్నతాధికారులకు సూచించారు.అలాగే స్కూల్‌ బస్‌ డ్రైవర్లకు మధ్యాహ్నభోజన సిబ్బందికి, పారిశుధ్ద్యం పనులు చేసే వారికి కూడా వ్యాక్సిన్‌ వేయించాలన్నారు.

విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఇతర స్టాఫ్‌ అందరూ వ్యాక్సినేషన్‌ వేసుకున్నట్టు తెలిసేలా ప్రతి పాఠశాల వద్ద బ్యానర్‌లను కట్టాలని అన్నారు. ప్రతి పాఠశాలలోనూ కోవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలోని తరగతి గదులను ప్రతి రోజూ శుభ్రం చేయించాలన్నారు. పాఠశాలలోని ఏ విద్యార్ధికైనా, స్టాఫ్‌కైనా కోవిడ్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరిలంచి కోవిడ్‌ పరీక్షలు చేయించాలని సూచించారు. ఎవరికైనా పాజిటివ్‌ లక్షణాలు ఉంటే వెంటనే వారిని ఐసొలేషన్‌కు తరలించాలన్నారు.
18 స o. లు పై బడిన విద్యారథులందరికీ కోవిడ్ వాక్సిన్ తీసుకొనే విధంగ చర్యలు తీసుకోవాలని సూచించారు.
మధ్యాహ్న భోజన పంపిణీలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రైవేటు పాఠశాలలో ఫీజులు బలవంతంగా వసూలు చేయరాదని కేవలం నెల ఫీజులు మాత్రమే వసూలు చేయాలని కలెక్టర్ తెలిపారు ప్రతి పాఠశాలలో 100% వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు సర్టిఫికెట్ సమర్పించాలి అని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, డి ఎం హెచ్ ఓ, చందు నాయక్ డాక్టర్ సౌభాగ్య డాక్టర్ రవిశంకర్ డి పి ఓ సురేష్, జడ్పీ సీఈఓ వెంకట్ రెడ్డి,అనిల్,యాదమ్మ,నిశిత, డి ఈ ఓ రవీందర్, కమిషనర్ మహేశ్వర రెడ్డి,రమేష్, డి ఐ ఈ ఓ, డి ఎస్ సి డి ఓ, డి సి డి ఓ, డి టి డబ్ల్యూ డి ఓ, బీఎండబ్ల్యూ ,సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కోఆర్డినేటర్లు, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ లు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, మున్సిపల్ కమిషనర్లు, ప్రైవేటు విద్యా సంస్థల యజమానులు తదితరులు పాల్గొన్నారు.

…………………

జిల్లా పౌర సంబంధాల అధికారి వనపర్తి చే జారీ చేయనైనది.

 

Share This Post