పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణాలు పటిష్టంగా ఉండాలి — జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రచురణార్థం

పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణాలు పటిష్టంగా ఉండాలి.

తొర్రూరు
మహబూబాబాద్ ఆగస్టు 27.

పాఠశాలల్లో విద్యార్థుల కొరకు నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణాలు పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు.

శుక్రవారం తొర్రూరు మండలం లో లో విస్తృతంగా పర్యటించి తొర్రూరు మున్సిపల్ పరిధిలోని విద్యాసంస్థలు, మడుపల్లి పాఠశాల పి హెచ్ సి నిర్మాణం లను కలెక్టర్ సందర్శించి పరిశీలించారు.

మడుపల్లి లో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి నిర్మాణం పై సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు అదేవిధంగా ఆవరణలో మొక్కలు నాటాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

అనంతరం అదే గ్రామంలోని పాఠశాల సందర్శించి మరుగుదొడ్లను స్వయంగా పరిశీలిస్తూ మరుగుదొడ్ల నిర్మాణాలు నాణ్యత ఉండాలని లేనట్లయితే తగు చర్యలు తీసుకుంటామని అన్నారు ప్రజాప్రతినిధుల సూచన మేరకు శిధిలావస్థకు చేరుకున్న పాఠశాల భవనాలను తొలగింప చేస్తామన్నారు.

అనంతరం తొర్రూరు మున్సిపల్ పరిధిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాల లను సందర్శించి పరిశుభ్రతను పరిశీలించారు కంప్యూటర్ విభాగాన్ని సందర్శించి కంప్యూటర్స్ పనిచేసే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

భోజనాల గదిని విద్యార్థులు నిద్రించే బెడ్స్ ను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు లైట్లు ఫ్యాన్లు వాటిని వెలిగించి పర్యవేక్షించారు మరుగుదొడ్లు నీటి సౌకర్యం లను పరిశీలించారు ఉపాధ్యాయులు విద్యార్థుల రాకను పండుగ వాతావరణం గా నిర్వహించాలన్నారు అదేవిధంగా పల్స్ ఆక్స్ మీటర్లు ధర్మ మీటర్ లు సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య సిబ్బంది చే పరీక్షలు నిర్వహించాలన్నారు మాస్కులు పెట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని శానిటైజర్ వినియోగించాలని భౌతిక దూరం వంటివి తప్పనిసరిగా పాటించాలన్నారు ప్రజా ప్రతినిధులు అధికారులకు సహకరించాలని కలెక్టర్ తెలిపారు.

కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య జడ్పిటిసి శ్రీనివాస్ జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ మున్సిపల్ కమిషనర్ గుండె బాబు ఎంపీడీవో భారతి డి ఈ అరుణ్ కుమార్ మడుపల్లి హెచ్ఎం సురేందర్ సర్పంచ్ వేల్పుల అంజలి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు
——————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post