పాఠశాలలో వసతులు ఏర్పాటు, నిర్మాణాలు పనుల పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
17 .9. 2021
వనపర్తి

వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో వసతులు ఏర్పాటుకు ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో పాఠశాల భవనాలు, మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్, వంట గదుల నిర్మాణాలు పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, హైస్కూల్లో దాదాపు మిషన్ భగీరథ త్రాగునీరు కుళాయిలు అమర్చడం జరిగింది తెలిపారు. అదనపు గదులు, వంటగది, మరుగుదొడ్డి, కాంపౌండ్ వాల్ చేపట్టిన నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఈవో రవీందర్, ఈ ఈ మల్లయ్య, భగీరథ ఈ ఈ మెగారెడ్డి, ఇంజనీర్లు యం. ఈ. వో . లు తదితరులు పాల్గొన్నారు.

…………

జిల్లా పౌరసంబంధాల అధికారి వనపర్తి జిల్లా జారీ చేయడమైనది.

Share This Post