పాఠశాలల్లోని విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలి : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్య ప్రసాద్
ఇల్లంతకుంట మండలంలో పర్యటించిన అదనపు కలెక్టర్
————————
————————
ఆదర్శ, సాంఘీక సంక్షేమ, కస్తూర్బా గాంధీ పాఠశాలల్లోని విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ఆదేశించారు.
బుధవారం ఆయన ఇల్లంతకుంట మండల రహీంఖాన్ పేట గ్రామంలోని ఆదర్శ పాఠశాల, ఇల్లంతకుంట మండల కేంద్రంలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు.
పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండేలా పర్యవేక్షణ చేయాలని సంబంధిత ప్రత్యేకాధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న దృష్ట్యా విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.
విద్యార్ధులతో కలిసి భోజనం….
రహేంఖాన్ పేట గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో స్వయంగా భోజనం చేసి మధ్యాహ్న భోజనం నాణ్యత తీరును అదనపు కలెక్టర్ పరిశీలించారు.
అలాగే జిల్లాలో బుధవారం నుండి శనివారం వరకు 4 రోజులు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సానిటేషన్ డ్రైవ్ లో భాగంగా ప్రతీ ఇంటికీ తిరుగుతూ పారిశుద్ధ్య నిర్వహణపై అదనపు కలెక్టర్ అవగాహన కల్పించారు. పారిశుద్ధ్యం సక్రమంగా ఉంటేనే సీజనల్ వ్యాధులు దరిచేరవని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా పంచాయతీ అధికారి ఎ.రవీందర్, జిల్లా విద్యాధికారి డా.రాధాకిషన్, ఎంపీడీఓ రాజేందర్ రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.