పాఠశాలల్లో పనులు వెంటనే ప్రారంభించాలి ….. జిల్లా.కలెక్టర్ కె. శశాంక

పాఠశాలల్లో పనులు వెంటనే ప్రారంభించాలి ….. జిల్లా.కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్థం

పాఠశాలల్లో పనులు వెంటనే ప్రారంభించాలి ….. జిల్లా.కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్ 13 మే 2022.

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండామన ఊరు మన బడి ప్రణాళికలు రూపొందించుకొని పాఠశాలల్లో పనులను వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కె శశాంక సంభందింత అదికారులను ఆదేశించారు.

శుక్రవారం సాయంత్రం సమావేశ మందిరంలో మన ఊరు- మన బడి పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జడ్ పి ఎస్ ఎస్, అర్బన్ పాఠశాలల్లో లే అవుట్స్ తప్పనిసరిగా గుర్తించాలని, దాన్ని బట్టి నిర్మాణాలు ఎక్కడ చేయకూడదు ఎక్కడ అనువైన స్థలమో, ఓపెన్ ఏరియా ఎంత ఉందో క్యాలిక్యులేషన్ చేసుకోని నిర్ణయించుకోవడం ఉత్తమమని, ఎఫ్ టి ఓ జనరేట్ చేయాలని, జి ప్లస్ టు ఉన్న కారిడార్ కలిపి టాయిలెట్స్ నిర్మాణాలు చేపట్టాలని, పంచాయతీ రాజ్ డి టీ డబ్ల్యు ఓ నుండి ఆర్ అండ్ బి తో సహా కావలసిన ఎస్టిమేషన్ చేసుకోవాలని, 30 లక్షల కు తక్కువగా ఉన్న పాఠశాలల్లో పనులను వెంటనే ప్రారంభించాలని, అవసరమున్న రిక్వైర్మెంట్ తెలపాలని, వచ్చే నెల జూన్ 13 కల్లా విద్యార్థులకు అత్యంత ముఖ్యమైన కిచెన్ షెడ్, టాయిలెట్స్, రిపేర్లు పనులను వెంటనే ప్రారంభిoచి త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని, శిథిలావస్థలో ఉన్న వాటిని వెంటనే తొలగించాలని, డ్యామేజ్ ఫ్లోరింగ్ ప్రారంభించు కోవాలని, నిర్మాణ పనుల్లో ప్రణాళికాబద్ధంగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా తరగతులు ప్రారంభమయ్యే లోగా పనులను పూర్తయినట్లు చూడాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.

అనంతరం దళిత బందు సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యూనిట్లకు ఇప్పటికే రేట్లను నిర్వహించడం జరిగిందని, లబ్ధిదారుల చే ఇన్వెస్ట్మెంట్ కొటేషన్ లెటర్ తేప్పించుకుని“305 యూనిట్లకు గాను 287 యూనిట్లకు మంజూరు చేయడం జరిగిందని మిగిలిన వాటికి వెంటనే మంజూరు తీసుకోవాలని బుధవారం సీఎం రివ్యూ ఉన్నందున సోమవారం లోగా మిగిలిన వాటిని సాంక్షన్ చేయాలని వాటికి వెంటనే గ్రౌండింగ్ పూర్తి చేసి సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డి టి డబ్ల్యూ ఓ డి డి దిలీప్ కుమార్, డి ఈ ఓ డాక్టర్ ఎండి అబ్దుల్ హై జిల్లా స్థాయి మండలాల ప్రత్యేక అధికారులు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ ఆర్ & బి ఈ ఈ లు, డి ఈ లు, ఏ ఈ లు, విద్యాశాఖ కోఆర్డినేటర్ మహంకాళి బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
—————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post