పాఠశాలల అభివృద్ధికి దాతలు రిటైర్డ్ ఉపాధ్యాయులు ముందుకు రావాలి – జిల్లా విద్యాశాఖాధికారి రమేష్

పాఠశాలల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలసినదిగా విద్యాశాఖాధికారి రమేష్ కుమార్ శుక్రవారం ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. విద్యాసంస్థలకు,దాతలకు అనుసంధానంగా ప్రభుత్వం httpws://vidyanjali.education.gov.in వెబ్ సైట్ ను రూపొందించిందని అన్నారు. ఈ వెబ్ సైట్ లో పాఠశాలల వారీగా అవసరమయ్యే వనరుల వివరాలుంటాయని,దాతలు వాటిని గుర్తించి ఆయా అవసరాలను తీర్చి విద్యాభివృధికి తమ వంతు సహకారమందించవలనదిగా ఆయన కోరారు. పాఠశాలలకు అవసరమైన వనరులు సమకూర్చుటకు ముందుకొచ్చే దాతలతో పాటు ప్రభుత్వ పాఠశాలలో భోధనాపరంగా స్వచ్ఛందంగా సేవ చేయుటకు ముందుకొచ్చే పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు కూడా ఈ వెబ్ సైట్ లో నమోదు కావడం ద్వారా సేవలందించవచ్చని అన్నారు. పూర్తి వివరాలకు సమగ్ర శిక్ష జిల్లా సెక్టోరల్ అధికారి డాక్టర్ సూర్యప్రకాష్ రావు ను 9441046839 ఫోన్ నెంబరు ద్వారా సంప్రదించాలని రమేష్ సూచించారు. ఇప్పటి వరకు విద్యంజాలి వెబ్ సైట్ లో నమోదు చేసుకున్న పాఠశాలలు తమ పాఠశాలకు అవసరమయ్యే వనరుల వివరాలను వెబ్ సైట్ లో పొందుపరచాలని డీఈఓ సూచించారు.

Share This Post