పాఠశాలల పునః ప్రారంభంపై వీడియో కాన్ఫరెన్సు : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

పత్రికా ప్రకటన     తేదీ:24-08 -2021
వనపర్తి

పాఠశాలల పునః ప్రారంభానికి సర్వం సిద్ధం గా ఉంచండి:

ఆగష్టు 30 లోగా పాఠశాలలో పారిశుద్ద్య పనులు పూర్తి చేయాలి

సెప్టెంబర్ 01 నుండి పాఠశాలలు ప్రారంభం

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి:-

సెప్టెంబర్ 01 నుండి అన్ని పాఠశాలలు ప్రారంభించ నున్నందున స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అన్ని పాఠశాలలో పారిశుద్ద్య పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు.

మంగళవారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, మున్సిపల్ నగర పాలక సంస్థ చైర్మన్లు, జిల్లా విధ్యాధికారులు, జిల్లా పంచాయితీ అధికారులతో పాఠశాలల పునః ప్రారంభం, పారిశుద్ద్య పనుల నిర్వాహణ పై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవిడ్ కారణంగా పాఠశాలలు తిరిగి 16 నెలల తర్వాత సెప్టెంబర్ 01 నుండి ప్రారంభించుకుంటున్నామని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలల్లో పారిశుద్ద్య చర్యలు చేపట్టాలని అన్నారు. పాఠశాలల్లో ప్రతి తరగతి గది ని ఫర్నిచర్ ను శుభ్రపరచాలని అన్నారు. పాఠశాలను నీటితో కడిగించాలని, ముఖ్యంగా టాయిలెట్లను శుభ్రపరచాలని అన్నారు. పాఠశాలల్లో గల కిచన్ షెడ్డులను ప్రత్యే కంగా శుభ్రపరచాలని అన్నారు. ప్రతి పాఠశాలకు మిషన్ భగీరథ ద్వారా నళ్లా నీరు సరఫరా ఉండేలా చర్యలు గైకోనాలని అన్నారు. విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్క విద్యార్థి తప్పని సరిగా మాస్కులు ధరించి పాఠశాలలకు రావాలని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలో కూడా పారిశుద్ద్య చర్యలు చేపట్టేలా జిల్లా విద్యాధికారులు పర్యవేక్షించాలని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల బస్సులలో విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకొవాలని అన్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కెంద్రాల పారిశుద్ద్య చర్యల భాద్యత సంబంధిత గ్రామ పంచాయితీదేనని తెలిపారు. పాఠశాలలు, అంగన్వాడీ కెంద్రాలలో పారిశుద్ద్య పనులలో గ్రామ సర్పంచు, ఎం.పి.పి.లు, జడ్పీటిసిలు, వార్డు మెంబర్లు, ఇతర ప్రజాప్రతినిధులందరూ భాగస్వామ్యులు కావాలని అన్నారు. ఆగష్టు 30 లోగా అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కెంద్రాలు పూర్తి స్థాయిలో పారిశుద్ద్య చర్యలు నిర్వహించి ప్రారంభానికి సిద్ధంగా ఉంచినట్లు సంబంధిత ప్రధానోపాధ్యాయులు సర్టిఫికెట్ ను ఇవ్వాలని అన్నారు. పాఠశాలలు ప్రారంభం అయిన తర్వాత ప్రతి రోజు కలెక్టర్లు, జిల్లా విద్యాధికారులు, జిల్లా పంచాయితీ అధికారులు, ఎం.పి.డి.వో.లు, మండల విద్యాధికారులు, మండల పంచాయితీ అధికారులు పాఠశాలలను సందర్శిస్తూ పారిశుద్ద్య చర్యలను కొనసాగేలా చర్యలు గైకోనాలని సూచించారు. కొంత మంది విద్యార్థుల తల్లిదండ్రులు కొవిడ్ థర్డ్ వేవ్ వస్తుందనే భయందోళనలో ఉన్నారని, విద్యార్థులను ఎవరిని బలవంతంగా పాఠశాలలకు తీసుకురావద్దని అన్నారు. కోవిడ్ నిబంధనల మేరకే స్వచ్చందంగా వచ్చే విద్యార్థులకు పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. పాఠశాలలో ఏదేనీ ఒక విద్యార్థి దగ్గు, జలుబు, జ్వరము వంటి కోవిడ్ లక్షణాలతో ఉంటే వెంటనే సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కెంద్రంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన పక్షంలో విద్యార్థి ఆ తరగతి గదిలో ఉన్న ప్రైమరీ కాంటాక్ట్ విద్యార్థులను గుర్తించి అందరికి కొవిడ్ పరీక్షలు చేయించాలని అన్నారు.

రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లో, అంగన్వాడీ కెంద్రాలలో పకడ్బందీ పారిశుద్ద్య చర్యలు చేపట్టి పండుగ వాతావరణంలో సెప్టెంబర్ 01 న పాఠశాలలను ప్రారంభించాలని అన్నారు. ప్రతి రోజు పాఠశాలల్లో పారిశుద్ద్య చర్యలు గ్రామ పంచాయితీ ద్వారా నిర్వహించాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించాలని, నిల్వ నీటిని లేకుండా మట్టి వేయించాలని అన్నారు. అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీలు, విద్యార్థుల కమిటీలు ఏర్పాటు చేసి పరిశుభ్రమైన పరిసరాలలో పాఠశాలల్లో విద్యా భోదన చేయుటకు చర్యలు తీసుకొవాలని సూచించారు. పూర్వ విద్యార్థుల నుండి డోనేషన్లు స్వీకరించి పాఠశాలల్లో వైట్ వాషింగ్ ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. అన్ని పాఠశాలల పారిశుద్ద్య పనుల నిర్వాహణ భాద్యత గ్రామ పంచాయితీలదేనని పంచాయితీ రాజ్ చట్టంలో ఉందని మంత్రి అన్నారు. ప్రతి పాఠశాలల్లో మిషన్ భగీరథ నళ్లా ఉండాలని సంబంధిత ఏ.ఈ.లు పాఠశాలను సందర్శించి లేనిచోట నళ్లాలు అమార్చాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాత్కాలిక మరమ్మత్తులు ఉంటే వెంటనే చేయించాలని అన్నారు. పాఠశాలల ప్రారంభాన్ని ప్రతి ఒక్కరూ చాలెంజ్ గా తీసుకొని పాఠశాలల్లో పకడ్బందీ పారిశుద్ద్య చర్యలు చేపట్టాలని అన్నారు. పారిశుద్ద్య చర్యల నిర్వాహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులు, ప్రజాప్రతినిధుల పై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి విద్యార్థి మాస్కు ధరించి పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకొవాలని జిల్లా విద్యాధికారులకు సూచించారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కెంద్రాల డాక్టర్లతో సమన్వయం చేసుకొవాలని అన్నారు. అన్ని పాఠశాలల్లో బ్లిచింగ్, లైమ్ చల్లించాలని, త్రాగు నీటి వాటర్ ట్యాంకులను క్లోరినేట్ చేయించాలని అన్నారు. అన్ని మున్సిపాలిటీలలో, నగరపాలక సంస్థల పరిధిలోని పాఠశాలలో, అంగన్వాడీ కెంద్రాలలో ఈగలు, దోమలు లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ సెప్టెంబర్ 1నుండి విద్యా సంస్థలు ప్రారంభిస్తున్న నందున మూడు రోజుల లోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పారిశుద్ధ్య చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. విద్యాశాఖ జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడి స్కూలు, హాస్టల్లో, కళాశాలలు, ప్రైవేటు పాఠశాలలు, పరిధిలో డి ఈఓ, డి ఐ ఒ పరిశీలించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయతీ వారీగా కమిటీ వేయాలన్నారు. విద్యాసంస్థలను 100% శానిటైజర్ చేయాలన్నారు. పాఠశాలలు, కళాశాలలో విద్యుత్ సదుపాయం మెరుగుపరచాలని మరుగుదొడ్లను శుభ్రపరిచి ఎలాంటి అపరిశుభ్రత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం కింద సరుకులు,గ్యాస్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఇంకా టెండర్ కాని పాఠశాలలో వెంటనే సరుకులకు సంబంధించిన టెండర్లు నిర్వహించాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా మెరుగైన నీరు అందేలా చూడాలన్నారు. ప్రస్తుతం డెంగీ మలేరియా జ్వరాలు ప్రబలుతుంది పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి మురుగు నీరు నిలువకుండా చూడాలి అన్నారు. గ్రామస్థాయిలో ఒకరిని సభ్యులుగా తీసుకోవాలన్నారు. మూడు రోజుల లోపు పాఠశాలలో కళాశాలలో అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సెప్టెంబర్ 1 నుండి విద్యాసంస్థలు ప్రారంభిస్తున్నదున ముందుగా వంట గదులు, మరుగుదొడ్లు శుభ్రం చేసుకోవాలన్నారు. డి ఈ ఓ, సి ఈఓ, డి పి ఓ మండలాలలో సమావేశాలు నిర్వహించాలన్నారు. అందరూ టాస్క్ఫోర్సు కమిటీగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. మన జిల్లా అక్షరాస్యతలో ముందు ఉండేలా అధికారులు పని చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీఈవో రవీందర్, సీఈఓ వెంకట్ రెడ్డి, డిపిఓ సురేష్, కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, ఎంప్లాయిమెంట్ అధికారి అనిల్, నుసిత తదితరులు పాల్గొన్నారు.

………….

జిల్లా పౌరసంబంధాల అధికారి వనపర్తి జారీ చేయడమైనది.

Share This Post