పాఠశాలల పునః ప్రారంభానికి సర్వం సిద్ధం గా ఉంచండి -రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి.

ఆగష్టు 24, 2021ఆదిలాబాదు:-

పాఠశాలల పునః ప్రారంభానికి సర్వం సిద్ధం గా ఉంచండి.

ఆగష్టు 30 లోగా పాఠశాలలో పారిశుద్ద్య పనులు పూర్తి చేయాలి.

సెప్టెంబర్ 01 నుండి విద్యాలయాలు పునః ప్రారంభం..రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి.

సెప్టెంబర్ 01 నుండి అన్ని పాఠశాలలు ప్రారంభించ నున్నందున స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అన్ని పాఠశాలలో పారిశుద్ద్య పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు.  మంగళవారం రోజున హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, మున్సిపల్ నగర పాలక సంస్థ చైర్మన్లు, జిల్లా విధ్యాధికారులు, జిల్లా పంచాయితీ అధికారులతో పాఠశాలల పునః ప్రారంభం, పారిశుద్ద్య పనుల నిర్వాహణ పై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవిడ్ కారణంగా పాఠశాలలు తిరిగి 16 నెలల తర్వాత సెప్టెంబర్ 01 నుండి ప్రారంభించుకుంటున్నామని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలల్లో పారిశుద్ద్య పనులు, మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాలని అన్నారు. పాఠశాలల్లో ప్రతి తరగతి గది ని ఫర్నిచర్ ను శుభ్రపరచాలని అన్నారు. పాఠశాలను నీటితో కడిగించి రసాయనాలను పిచికారీ చేయించాలని, ముఖ్యంగా మరుగుదొడ్లను శుబ్రం చేయించాలని అన్నారు. పాఠశాలల్లోని కిచేన్ షెడ్డులను ప్రత్యేకంగా శుబ్రం చేయించాలని అన్నారు. ప్రతి పాఠశాలకు మిషన్ భగీరథ ద్వారా నళ్లా నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, ప్రతీ విద్యార్థి తప్పని సరిగా మాస్కులు ధరించి పాఠశాలలకు రావాలని, భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలో కూడా పారిశుద్ద్య పనులు  చేపట్టేలా జిల్లా విద్యా శాఖాధికారులు పర్యవేక్షించాలని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల బస్సులలో విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకొవాలని అన్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కెంద్రాల పారిశుద్ద్య చర్యల భాద్యత ఆయా గ్రామ పంచాయితీలదేనని తెలిపారు. పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలలో పారిశుద్ద్య పనులలో  గ్రామ సర్పంచు, ఎం.పి.పి.లు, జడ్పీటిసిలు, వార్డు మెంబర్లు, గ్రామాల్లోని ప్రజాప్రతినిధులందరూ భాగస్వామ్యులు కావాలని అన్నారు. ఆగష్టు 30 లోగా అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కెంద్రాలలో పూర్తి స్థాయిలో పారిశుద్ద్య పనులు నిర్వహించి ప్రారంభానికి సిద్ధంగా ఉంచినట్లు సంబంధిత ప్రధానోపాధ్యాయులు సర్టిఫికెట్ ను జిల్లాల కలెక్టర్ లకు సమర్పించాలని తెలిపారు. పాఠశాలలు ప్రారంభం అయిన తర్వాత ప్రతి రోజు జడ్పీ చైర్మన్లు, కలెక్టర్లు, జిల్లా విద్యాధికారులు, జిల్లా పంచాయితీ అధికారులు, ఎం.పి.డి.వో.లు, మండల విద్యాధికారులు, మండల పంచాయితీ అధికారులు పాఠశాలలను సందర్శిస్తూ పారిశుద్ద్య కార్యక్రమాలు కొనసాగేలా చర్యలు చేపట్టాలని సూచించారు.  కొంత మంది విద్యార్థుల తల్లిదండ్రులు కోవిడ్ థర్డ్ వేవ్ వస్తుందనే భయందోళనలో ఉన్నారని, విద్యార్థులను ఎవరిని బలవంతంగా పాఠశాలలకు తీసుకురావద్దని అన్నారు. కోవిడ్ నిబంధనల మేరకే స్వచ్చందంగా వచ్చే విద్యార్థులకు పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. పాఠశాలలో ఎవరైనా ఒక విద్యార్థికి దగ్గు, జలుబు, జ్వరము వంటి కోవిడ్ లక్షణాలతో ఉంటే వెంటనే సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కెంద్రంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన పక్షంలో ఆ విద్యార్థి  తరగతి గదిలో ఉన్న  ప్రైమరీ కాంటాక్ట్ విద్యార్థులను గుర్తించి అందరికి కోవిడ్ పరీక్షలు చేయించాలని అన్నారు. రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లో, అంగన్ వాడీ కేంద్రాలలో  పకడ్బందీ పారిశుద్ద్య చర్యలు చేపట్టి పండుగ వాతావరణంలో సెప్టెంబర్ 01 న పాఠశాలలను పునః ప్రారంభించాలని అన్నారు. ప్రతి రోజు పాఠశాలల్లో పారిశుద్ద్య చర్యలు గ్రామ పంచాయితీ ద్వారా నిర్వహించాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించాలని, నీటి నిల్వలు లేకుండా మట్టి వేయించాలని అన్నారు. అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీలు, విద్యార్థుల కమిటీలు ఏర్పాటు చేసి పరిశుభ్రమైన పరిసరాలలో పాఠశాలల్లో విద్యా భోదన చేయుటకు చర్యలు తీసుకొవాలని సూచించారు. పూర్వ విద్యార్థుల నుండి డోనేషన్లు స్వీకరించి పాఠశాలల్లోని గోడలకు రంగులు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు.  పాఠశాలలో పారిశుద్ద్య పనుల నిర్వాహణ భాద్యత గ్రామ పంచాయితీలదేనని పంచాయితీ రాజ్ చట్టంలో ఉందని మంత్రి అన్నారు. ప్రతి పాఠశాలల్లో మిషన్ భగీరథ నళ్లా ఉండాలని సంబంధిత ఏ.ఈ.లు పాఠశాలను సందర్శించి లేనిచోట నళ్లాలను అమార్చాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాత్కాలిక మరమ్మత్తులు ఉంటే వెంటనే చేయించాలని అన్నారు. పాఠశాలల ప్రారంభాన్ని ప్రతి ఒక్కరూ చాలెంజ్ గా తీసుకొని పాఠశాలల్లో పకడ్బందీ పారిశుద్ద్య చర్యలు చేపట్టాలని అన్నారు. పారిశుద్ద్య చర్యల నిర్వాహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులు, ప్రజాప్రతినిధుల పై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.  ప్రతి విద్యార్థి మాస్కు ధరించి పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకొవాలని జిల్లా విద్యాధికారులకు సూచించారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కెంద్రాల డాక్టర్లతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. అన్ని పాఠశాలల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని, లైమ్ చల్లించాలని, త్రాగు నీటి వాటర్ ట్యాంకులను క్లోరినేషన్ చేయించాలని అన్నారు. అన్ని మున్సిపాలిటీలలో, నగరపాలక సంస్థల పరిధిలోని పాఠశాలలో, అంగన్వాడీ కెంద్రాలలో ఈగలు, దోమలు లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమాలలో ఆశ్రద్ద కనబరిచిన అధికారులు , ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.    ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు జిల్లా కలెక్టర్ కు సహకారం అందిస్తామని అన్నారు. ముఖ్యముగా జిల్లాలో గిరిజన ప్రాంతాలతో పాటు ఇతర పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించవలసి ఉందని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు నిర్మించుకొనుటకు అనుమతించాలని కోరారు. ఈ వీడియో కాన్పరెన్సులో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, పురపాలక శాఖ కమిషనర్ సత్యనారాయణ, పాఠశాల విద్య సంచాలకురాలు శ్రీదేవసేన, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, డీఈఓ రవీందర్ రెడ్డి, డీపీఓ శ్రీనివాస్, మిషన్ భగీరథ ఎస్ ఈ వెంకటేశ్వర్లు, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

…………………………………………………………………. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post