@ ఫిబ్రవరి 1 న మన ఊరు- మన బడి పాఠశాలల ప్రారంభం
@ పాఠశాలల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేయాలి- జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు
మన ఊరు-మన బడి కింద పూర్తయిన పాఠశాలలను ఫిబ్రవరి 1 న ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు అన్నారు.
సోమవారం ఆయన ప్రజా వాణి కార్యక్రమంలో భాగంగా నూతన కలేక్టర్ కార్యాలయంలో ప్రజల వద్దనుండీ ఫిర్యాదులను స్వీకరించారు.
సోమవారం 86 మంది పిర్యాదుదారులు వారి ఫిర్యాదులు సమర్పించారు.అంతకుముందు జిల్లా కలెక్టర్ పిర్యాదు ల పై సమీక్షిస్తూ జిల్లా అధికారులు ప్రజలు సమర్పించిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని,ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు పెండింగులో ఉన్న అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఫిర్యాదులు పరిష్కరించాలని చెప్పారు.
ఈ సందర్బంగా ఆయా శాఖల వారిగా పెండింగులో ఉన్న ఫిర్యాదులను చదివి వినిపించారు.
అనంతరం మన ఊరు- మన బడి పనులపై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ…మన ఊరు -మన బడి కింద పూర్తి చేసిన పాఠశాలలను ఫిబ్రవరి 1 న ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.ప్రజా ప్రతినిధులు,తల్లి తండ్రుల ను ప్రారంభోత్సవానికి పిలవాలన్నారు.జిల్లాలోని మహబూబ్ నగర్,జడ్చర్ల,దేవరకద్ర నియోజక వర్గాలలో సైతం పూర్తయిన పాఠశాలలను ప్రారంభించాలన్నారు.సుమారు 20 పాఠశాలలు ప్రారంభానికి సిద్ధంగా ఉండగా,మరో 30 పాఠశాలల్లో ల్యాండ్ స్కేప్ అభివృద్ధి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామారావు,జెడ్ పి సి ఈ ఓ జ్యోతి,ఆర్ డి ఓ అనిల్ కుమార్,డి ఆర్ డి ఓ యాదయ్య,జిల్లా అధికారులు ఉన్నారు.