పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బంది కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకునేలా చూడాలి- జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

పత్రికా ప్రకటన నల్గొండ
3.9. 2021
____________

పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బంది కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకునేలా చూడాలి- జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

ఒకటిన్నర సంవత్సరం తర్వాత పాఠశాలలను తిరిగి ప్రారంభించినందున పాఠశాలల్లో,విద్యాసంస్థలలో పూర్తి కోవిడ్ నిబంధనలు అమలు చేస్తూ బోధన,బోధనేతర సిబ్బంది తో పాటు 18 సం.లు పైబడిన విద్యార్థులకు వ్యాక్సినేషన్ తీసుకొని వారికి వ్యాక్సినేషన్ వేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు
శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో తన చాంబర్ లో విద్యాశాఖ అధికారులు, సంక్షేమ శాఖల అధికారులు,గురుకులాల ప్రిన్సిపాల్స్ లతో నిర్వహించిన సమావేశం లో పాఠశాలల్లో విద్యార్థుల హాజరు,పరిశుభ్రత,మధ్యాహ్న భోజనం,వ్యాక్సినేషన్ పై కలెక్టర్ చర్చించారు.
చాలా రోజుల తర్వాత పాఠశాలలను ప్రారంభించడం జరిగిందని ,అయితే ఏ పాఠశాలలో కూడా కరోనా కేసులు నమోదు కాకూడదని ఇందుకుగాను పాఠశాలల్లో పూర్తి స్థాయి కోవిడ్ నిబంధనలు అమలు చేయాలని,అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందితో సహా ,18 సంవత్సరాలు పైబడిన విద్యార్థులందరు వాక్సిన్ తీసుకొని ఉండాలని, ఇంకా ఎవరైనా వాక్సిన్ తీసుకోకుంటే వెంటనే తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నల్గొండ ఎన్. జి.కళాశాలలో వ్యాక్సినేషన్ క్యాంప్ నిర్వహించాలని డిప్యూటీ డి.యం.హెచ్.ఓ.ను ఆదేశించారు.

ఈ సమావేశం లో జిల్లా విద్యా శాఖ అధికారి భిక్షపతి,జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రాజ్ కుమార్,సాంఘిక సంక్షేమ శాఖ డి.డి.సల్మా బాను,జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి పోచం తదితరులు పాల్గొన్నారు. –

———————————-సహాయ సంచాలకులు, సమాచార శాఖ,నల్గొండ చే జారీ చేయనైనది
____________జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ చే జారీ చేయనైనది

 

Share This Post