ప్రచురణార్ధం
పాఠశాల సమస్యలను పరిష్కరిస్తాం…
మహబూబాబాద్, అక్టోబర్,29.
పాఠశాల సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.
శుక్రవారం కలెక్టర్ పట్టణంలోని ఈద్గా నగర్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న 461మంది విద్యార్థుల హాజరును పరిశీలించి పూర్తిస్థాయిలో హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రహరీ నిర్మాణానికి, మధ్యహన్న భోజన వసతికి వంటగది ఏర్పాటుకు చర్యలు తీసుకుంటూ డ్రైనేజి కాలువ నిర్మాణానికి మున్సిపాలిటీ అధికారులను అదేశిస్తామన్నారు.
కలెక్టర్ వెంట విద్యాధికారి సోమశేఖరశర్మ, ప్రధానోపాధ్యాయులు మురళి పాల్గొన్నారు.
————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం…మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.