పాఠశాల స్థాయి నుండే కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కలిగియుండి ఆలోచన శక్తిని పెంపొందించుకోవాలి:: జిల్లా కలెక్టర్ కె.శశాంక

పాఠశాల స్థాయి నుండే కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కలిగియుండి ఆలోచన శక్తిని పెంపొందించుకోవాలి:: జిల్లా కలెక్టర్ కె.శశాంక

ప్రచురణార్థం
సెప్టెంబర్ 22 మహబూబాబాద్

పాఠశాల స్థాయి నుండే కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కలిగియుండి ఆలోచన శక్తిని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు.
అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్, ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ ఆధ్వర్యంలో గిరిజన బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్న కంప్యూటర్ శిక్షణ తరగతుల సందర్భంగా ముత్యాలమ్మ గూడెం ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్ధినిలనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థినిలకు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందించేందుకు అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ కార్యక్రమం కింద రాష్ట్రంలో 50వేల మంది పాఠశాల స్థాయి విద్యార్థినులకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చేందుకు అమెజాన్, ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలో ప్రస్తుతం మహబూబాబాద్ ముత్యాలమ్మ గూడెం పాఠశాలల విద్యార్థినిలకు మూడు నెలలపాటు కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. పదవ తరగతి తర్వాత ఉన్నత విద్య తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండడం ద్వారా ఉపాధి అవకాశాలు సులువుగా లభిస్తాయని, జీవిత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నత విద్యా ద్వారానే సాధ్యమని ఇట్టి అవకాశాన్ని విద్యార్థినిలు సద్వినియోగపరచుకోవాలని కలెక్టర్ సూచించారు.

శిక్షణ కలెక్టర్ పరమర్ పింకేశ్వర కుమార్ లలిత్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వేర్ రెడ్డి, డిప్యూటీ డైరక్టర్ ఎం. ఎర్రయ్య, ఏ టి డి ఓ సత్యవతి, అమెజాన్ ప్రతినిధులు రాజ్ శశాంక్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ నుండి తనుశ్రీ ,రణధీర్, పాఠశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post